Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: September 12, 2019, 5:14 PM IST
భాగ్యలక్ష్మి ఆలయంలో మోహన్ భగవత్
నవరాత్రుల్లో పూజలందుకొని గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథుల విగ్రహాలతో భాగ్యనగరం కళకళలాడుతోంది. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్, కోఠి, ఆబిడ్స్, చార్మినార్, అఫ్జల్ గంజ్, ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇక, వినాయక నిమజ్జన ఉత్సవాన్ని తిలకించేందుకు తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్.. చార్మినార్ నుంచి బయలుదేరి భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధుల సారథ్యంలో మొజాంజాహి మార్కెట్‌కు చేరుకున్నారు. అంతకుముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ.. శక్తికి ప్రతిరూపం అని, పార్వతీదేవి ప్రియపుత్రుడని వ్యాఖ్యానించారు. భక్తితోనే గణాధ్యక్ష పదవిని పొందిన చరిత్ర వినాయకుడిదని, భక్తితో పాటు మంచి ఆలోచనలు కూడా ఉండాలని అన్నారు.
మన అందరి మాత.. భారత మాత అని, జగన్మాతను మించిన దైవం లేదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మనందరం ఒకటే సమాజమని అన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
September 12, 2019, 4:25 PM IST