Home /News /national /

RSS CHIEF MOHAN BHAGAWATH WELCOMES SUPREME COURT VERDICT ON AYODHYA MS

Ayodhya Verdict : సుప్రీం తీర్పును స్వాగతించిన మోహన్ భగవత్

మోహన్ భగవత్(File Photos)

మోహన్ భగవత్(File Photos)

సుప్రీం కోర్టు తీర్పును ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వాగతించారు. సుప్రీం ఇచ్చిన తీర్పు విజయం లేదా ఓటమి రెండూ కాదని చెప్పారు.

    సుప్రీం కోర్టు తీర్పును ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వాగతించారు. సుప్రీం ఇచ్చిన తీర్పు విజయం లేదా ఓటమిగా చూడవద్దన్నారు. కోర్టు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చిందన్నారు.సుప్రీం తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలని అన్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఒక కొలిక్కి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నట్టు చెప్పారు. అందరూ ఐక్యంగా ఉండి రామ మందిర నిర్మాణం చేపట్టాలని సూచించారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.సుప్రీం తీర్పు అనంతరం ఢిల్లీలోని కేశవ్ కంజ్ పరిసర్‌‌లో ఆయన మాట్లాడారు.

    కాగా,అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ స్థలం తమదేనని నిరూపించడానికి ముస్లిం సంస్థలు సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయానని సుప్రీం పేర్కొంది. ఆ స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తున్నట్టు తెలిపింది. ముస్లింల మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని చెప్పింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు