Home /News /national /

RS 75 CRORE DEPOSITED IN BANK ACCOUNT OF JHARKHAND ELDERLY PERSON PENSION ACCOUNT SK

నిరుపేద వృద్ధుడు.. పెన్షన్ కోసం బ్యాంక్‌కు వెళ్లాడు.. ఖాతా చెక్ చేస్తే రూ.75 కోట్లు

ఫూలో రాయ్ (Image:Twitter)

ఫూలో రాయ్ (Image:Twitter)

Jharkhand: డబ్బులు ఎలా వచ్చాయో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. దీనిపై బ్యాంక్ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఎలా డిపాజిట్ అయ్యాయన్న దానిపై విచారణ చేస్తున్నారు.

    ఆయన నిరుపేద వృద్ధుడు. పక్కా ఇల్లు కూడా లేదు. పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. ఉన్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ప్రభుత్వం నుంచి నెలా నెలా పెన్షన్ (Pension) వస్తుంది. ఆ డబ్బులను విత్ డ్రా (Cash Withdraw) చేసేందుకు ఓసారి బ్యాంక్‌కు వెళ్లాడు. డబ్బులు తీసుకున్న తర్వాత ఖాతాల్లో డబ్బుల గురించి ఆరాతీశారు. ఐతే ఆయన ఖాతాల్లో ఉన్న డబ్బులను చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్లో (Bank Account) వేలు కాదు.. లక్షలు కాదు.. కోట్ల రూపాయల డబ్బుంది. ఏకంగా రూ.75 కోట్లు ఉండడంతో షాక్ తిన్నారు. ఇప్పుడీ వార్త వైరల్‌గా మారింది. అసలు నిరుపేద ఖాతాల్లో అన్ని కోట్ల డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు.

    Srinagar: స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? అచ్చం ఈ రైల్వేస్టేషన్‌లా

    ఝార్ఖండ్‌ (Jharkhand)లోని దుమ్మా జిల్లా జార్ముండి మండలం సాగర్ గ్రామానికి చెందిన ఫూలో రాయ్ వయసు 63 ఏళ్లు. భార్యా, కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే ఆయనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of india)లో ఖాతా ఉంది. ఐతే ఇటీవల పింఛను డబ్బులు తీసుకునేందుకు.. తమ గ్రామ సమీపంలో ఉన్న రూరల్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాడు ఫూలో రాయ్. ఖాతాల్లో ఉన్న రూ.10వేలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత.. తన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాడు. దాని గురించి బ్యాంక్ అధికారిని అడగడంతో ఆయన వివరాలు చూసి ఖంగుతిన్నాడు. రైతు ఖాతాల్లో ఏకంగా రూ.75 కోట్లు ఉండడంతో షాక్ అయ్యాడు. అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని అతడు బ్యాంక్ అధికారులకు చెప్పాడు.

    అద్భుతం చేసిన కరోనా టీకా.. మూగ వ్యక్తికి మాటలు.. చచ్చుబడిన శరీరంలో కదలికలు

    చాలా రోజులుగా ఫూలో రాయ్ ఖాతా ఇన్ ఆపరేటివ్‌గా ఉంది. చాలా రోజుల తర్వాత అతడు డబ్బులను విత్ డ్రా చేసేందుకు వెళ్లారు. మరి అలాంటి ఖాతాల్లోకి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. దీనిపై బ్యాంక్ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఎలా డిపాజిట్ అయ్యాయన్న దానిపై విచారణ చేస్తున్నారు. సాంకేతిక సమస్య వల్ల ఆ మొత్తం చూపిస్తోందా? లేదంటే ఎవరైనా నిజంగా డబ్బులను ఆ ఖాతాలో డిపాజిట్ చేశారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఫూలో రాయ్ ఖాతాలో రూ.75 ఉన్నాయనే వార్త చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసింది. అంత డబ్బు ఎలా వచ్చిందని అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ డబ్బులో కొంత మొత్తాన్ని ఫూలో రాయ్‌కి ఇచ్చి..మిగిలిన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగించాలని కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jharkhand, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు