Home /News /national /

RS 65 REDUCTION ON NON SUBSIDIZED LPG GAS CYLINDER IN INDIA BN

Coronavirus:ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. గ్యాస్ ధర తగ్గింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. కరోనా వైరస్ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో సిలిండర్‌పై రూ.65 తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది.

    ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సబ్సీడియేతర ఎల్‌పీజీ సిలిండర్(14.2కేజీలు)పై రూ.65 మేర తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు 55 శాతం మేర పడిపోయాయి. దీంతో సిలిండర్ ధర తగ్గించినట్టు బుధవారం ఐఓసీ ప్రకటించింది. ఈ కొత్త ధర ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. ఈ ధరల తగ్గింపు వల్ల ఎల్‌పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.744కే లభించనుండగా, గత నెలలో ఇది రూ.805.5గా ఉండేది. అంటే ఈ లెక్కన సిలిండర్‌పై రూ.61.5 తగ్గింది.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Corona, Gas, Indian Oil Corporation, IOC, LPG Cylinder, Oil prices

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు