RS 50000 COMPENSATION FOR EACH COVID DEATH STATES TO PROVIDE VRY
Corona Ex Gratia: కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల ఎక్స్గ్రేషియా.. రాష్ట్రాలు ఇవ్వాలన్న కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
Corona Ex Gratia : కరోనాతో మృత్యువాత పడిన కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని జాతీయ విపత్తుల నిర్వాహణ అథారిటి స్పష్టం చేసింది. కాగా ఇదే విషయాన్ని నేడు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.
ఇటివల కరోనాతో(corona) మృత్యువాత పడిన కుటుంబాలతో పాటు కరోనా సేవల్లో మృత్యువాత పడిన కుటుంబాలకు సైతం 50 వేల రూపాయాల ఎక్స్ గ్రేషియా ( Ex Gratia)చెల్లించాలని జాతీయ విపత్తుల నిర్వహాణ అథారిటి నిర్ణయింది. ఈ మేరకు గైడ్లైన్స్ విడుదల చేసింది. కాగా ఈ ఏక్స్గ్రేషియాను రాష్ట్రాలకు చెందిన ఎస్డీఆర్ఎఫ్(sdrf) నుండి చెల్లించాలని సూచించింది.
ఇక కోవిడ్ మరణాలకు సంబంధించి ఐసిఎమ్ఆర్(icmr) గైడ్లైన్స్ ఫాలో అవుతూ బాధితులు ఇందుకోసం ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరణ దృవీకరణకు సంబంధించి కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా కరోనా మృతుల కటుంబాలకు నాలుగు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లించనున్నట్టు ప్రకటించినప్పటికి ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఆయా రాష్ట్రాలే కోవిడ్ మృతుల కుటుంబాలతో పాటు విపత్తులో సహయం చేసిన వారి మృతుల కుటుంబాలకు సైతం రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుండి చెల్లించాలని మార్గదర్శకాలు పేర్కొనడం గమనార్హం.
అయితే ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాలు(states) నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర విపత్తుల నిధికి కేంద్రం సహాయం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు కూడా ఆ నిధిలో ఉంటాయి కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.