హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

IRCTC: రూ.20 టీ కి రూ.50 సర్వీస్ ఛార్జి.. ఇంత దోపిడా అని తీవ్ర విమర్శలు.. రైల్వేశాఖ ఏం చెప్పిందంటే..

IRCTC: రూ.20 టీ కి రూ.50 సర్వీస్ ఛార్జి.. ఇంత దోపిడా అని తీవ్ర విమర్శలు.. రైల్వేశాఖ ఏం చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRCTC: రైలులో టీ ధర ఎంత ఉంటుంది. మహా అయితే రూ.20 ఉంటుంది. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం రూ.70 చెల్లించాల్సి వచ్చింది. ఇందులో టీ ధర రూ.20 కాగా.. సర్వీస్ చార్జీ కింద రూ.50 వసూలు చేశారు. దీనిపై రైల్వేశాఖ ఏమందో తెలుసా..?

స్టార్ హోటల్స్‌లో బిల్లుల మోత మామూలుగా ఉండదు. ఏ చిన్నది ముట్టుకున్నా.. జేబు ఖాళీ అవుతుంది. బయట పది రూపాయలకు దొరికే.. టీ కూడా అక్కడ వందల్లో పలుకుతుంది. ఇక బిర్యానీ వంటి ఆహార పదార్థాలయితే వేల రూపాయలు ఖర్చు చేయాలి. ఐతే సామాన్యులు  ప్రయాణించే రైళ్లలో మాత్రం ధరలు కాస్త అందుబాటులోనే ఉంటాయి. బయట దొరికే ధరలకు కాస్త అటూ ఇటూగానే.. అన్నీ లభ్యమవుతాయి. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం సింగిల్ టీకి ఏకంగా రూ. 70 చెల్లించాల్సి వచ్చింది. ఇందులో టీ ధర రూ.20 కాగా.. సర్వీసు చార్జీ కింద మరో రూ.50 వసూలు చేశారు. మరింత ఒక్క టీకి అంత సర్వీస్ చార్జి ఎందుకు వసూలు చేశారు? ఆ ప్రయాణికుడు ఏమంటున్నాడు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video : చిరుత వేగం చూడాలంటే దీనిని మించిన వీడియో ఉండదేమో!

జూన్‌ 28న ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి భోపాల్‌కు వెళ్లే శతాబ్ది రైలు (Shatabdi Trains)లో ప్రయాణించాడు. రైలు ప్రయాణ సమయంలో ఉదయం ఐఆర్‌సీటీసీ సిబ్బంది వద్ద టీ కొన్నాడు. వారు ఒక్క టీకి రూ.70 వసూలు చేయడంతో అతడు షాక్ తిన్నాడు. మరీ ఇంత దారుణమా? ప్రయాణికులను దోచుకుంటున్నారని అని అతడు మండిపడ్డాడు. మాకేం తెలియదు సార్.. రైల్వే శాఖ చార్జీలు ఇలానే ఉన్నాయని సిబ్బంది చెప్పారు. రైలులో తనకు ఎదురైన అనుభవం గురించి ఆ వ్యక్తి జూన్ 29 ట్వీట్ చేశాడు. టీ బిల్లు ఫొటోను షేర్ చేశాడు. 20 రూపాయల టీకి.. 50 రూపాయల ట్యాక్స్. దేశంలో చరిత్ర మాత్రమే మారిందనుకున్నా. అర్ధశాత్రం కూడా మారుగుతోందని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌కు ఈ వార్త రాసే సమయానికి 9వేలకు పైగా లైక్‌లు, 3వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి.

ఆ ట్వీట్ చూసి చాలా మంది నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని ధరలను పెంచేశారని విమర్శిస్తున్నారు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా వ్యవహారం ఉందని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం అది ట్యాక్స్ కాదని.. సర్వీస్ చార్జి (Service Charge)  అని క్లారిటీ ఇస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు కూడా స్పందించారు. ప్రయాణికుడి నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదని స్పష్టత ఇచ్చారు.


సాధారణంగా రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో రిజర్వేషన్ చేసేటప్పుడు ప్రయాణికుడు భోజనం బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలోనే... ప్రయాణ చార్జీలతో పాటు భోజనం డబ్బులను కూడా వసూలు చేస్తారు. ఒకవేళ టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకుండా.. ప్రయాణ సమయంలో టీ, కాఫీ లేదా ఆహారాన్ని ఆర్డర్ ఇస్తే.. రూ.50 సర్వీస్ చార్జీ వసూలు చేస్తారు. రైలులో రూ.300కి ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.350 చెల్లించాల్సి ఉంటుంది. రూ.20 విలువైన టీ ఆర్డర్ చేసినా.. సర్వీస్ చార్జీకి రూ.50 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రయాణికుడి విషయంలో కూడా ఇదే జరిగింది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు 2018లో ఉత్తర్వులు చేసిందని ఐఆర్‌సీటీసీ (IRCTC) స్పష్టం చేసింది.

First published:

Tags: Indian Railways, IRCTC, Tea

ఉత్తమ కథలు