• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • RS 5 CR OLD NOTES SIEGED AT SHIVAGANGA IN TAMIALANADU VS

ఇంకా ఉన్నాయా..! డాక్టర్ ఇంట్లో పాత నోట్లు..5 కోట్లు సీజ్...ఇన్నాళ్లు ఏం చేశావు నాయనా...?

ఇంకా ఉన్నాయా..! డాక్టర్ ఇంట్లో పాత నోట్లు..5 కోట్లు సీజ్...ఇన్నాళ్లు ఏం చేశావు నాయనా...?

black money in Tamilanadu

money money...తమిళనాడులోని శివగంగా జిల్లాలో సుమారు 5 కోట్ల రూపాయల, 1000 నోట్లు లభించాయి. ఓ డాక్టరు ఇంట్లో పాత నోట్లు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. దీంతో సుమారు 5 కోట్లు బయటపడ్డాయి.

  • Share this:
మోడి ప్రభుత్వం పాత నోట్ల రద్దు చేసి అయిదు సంవవత్సారాలు కావాస్తున్నా..ఇంకా కోట్ల కొద్ది పాత నోట్లు బయటపడుతున్నాయి. తాజాగా తమిళనాడులోని శివగంగా జిల్లాలో సుమారు 5 కోట్ల రూపాయల, 1000 నోట్లు లభించాయి. నోట్ల రద్దు చేసిన తర్వాత మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా...కోట్లాది రూపాయల నల్లధనం కూడపెట్టిన కుబేరులకు వాటిని చట్టప్రకారం మార్చుకునేందుకు వీలు లేకపోవడంతో , సుమారు 20 వేల కోట్ల రుపాయలు నోట్లు ఇంకా మర్పిడి చేసుకోకుండా వారి వద్దే ఉన్నాయని ఆర్ధిక శాఖ గతంలో వివరించింది.. దీంతో అవి కొద్దికొద్దిగా ఇప్పుడు బయటపడుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే  ఇంట్లో దాచి ఉంచిన రద్దు అయిన పాత కరెన్సీనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలో వెలుగుచూసింది. శివగంగా జిల్లా కలయార్కోయిల్ ప్రాంతానికి చెందిన ఫిజియోథెరపిస్టు అరుల్ చిన్నప్పన్ ఇంట్లో పాత కరెన్సీనోట్లు పెద్ద మొత్తంలో ఉన్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అరుల్ చిన్నప్పన్ ఇంటిపై దాడి చేసి రూ.4.8కోట్ల విలువైన పాత కరెన్సీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దు అయిన 1000రూపాయల విలువగల కరెన్సీనోట్లు లభించాయని పోలీసులు చెప్పారు. అరుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

నోట్ల రద్దు ప్రకటన నాటికి దేశంలో రూ.17.50 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్టు ఆర్ధిక శాఖశాఖ అధికారులు వెల్లడించారు.కాగా. అందులో రూ.500, రూ.1000 నోట్లు రూ.15.44 లక్షల కోట్లు అంటే అప్పటికి చలామణిలో ఉన్న నగదులో 86 శాతం ఈ పెద్దనోట్లే కావడంతో మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల చలామణిని రద్దు చేసింది..అయితే చలామణిలో ఉన్న పెద్ద నోట్లలో 2017 జూన్ 30 నాటికి బ్యాంకుల్లో రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్ అయింది. బ్యాంకులకు చేరనిది సుమారు 20 వేల కోట్ల రూపాయాలు ఉన్నట్టు సమాచారం.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు