హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రూ.2 కోట్ల డబ్బు సంచితో రైలెక్కాడు.. కానీ టికెట్ తీసుకోలేదు.. అదే కొంప ముంచింది

రూ.2 కోట్ల డబ్బు సంచితో రైలెక్కాడు.. కానీ టికెట్ తీసుకోలేదు.. అదే కొంప ముంచింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి రూ.2 కోట్ల డబ్బుతో రైలు ఎక్కాడు. కానీ టికెట్ మాత్రం తీసుకోలేదు. టికెట్ తీసుకోకపోవడం వల్ల చిక్కుల్లో పడ్డాడు. ఆ రెండు కోట్ల డబ్బు కూడా పోయింది. ఇంతకి ఏం జరిగింది?

అతడి చేతిలో కోట్ల రూపాయల డబ్బుంది. బ్యాగు నిండా నోట్ల కట్టలే ఉన్నాయి. మొత్తం రూ.2 కోట్ల వరకు ఉంటుంది. అంతడబ్బున్న అతడు.. సాధారణ ప్రజలు వెళ్లే రైలు (Indian Railways)లో ఎక్కాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అతడు ట్రైన్ టికెట్ తీసుకోలేదు.  టికెట్ లేని ప్రయాణం నేరమని తెలిసినా.. ఎంచక్కా రైలులో వెళ్లాడు. అన్ని కోట్లు చేతిలో ఉన్నా.. ఐదారు వందలు పెట్టి.. టికెట్‌ను కొనలేదు. అసలేంటీ కథ? అంత డబ్బుతో అతడు రైలెందుకు ఎక్కాడు? కోట్లు చేతిలో ఉన్నా.. టికెట్ ఎందుకు కొనలేదు.?

Bank Strike: ఖాతాదారులకు అలర్ట్... వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్

రాజస్థాన్‌ (Rajasthan)లోని  సుంత్రా జిల్లా జాలోర్ తాలుకా వారన్వా గ్రామానికి చెందిన  జెన్ సింగ్ అలియాస్ మనోహర్ సింగ్ జూన్ 8న.. ముంబైలోని ఛత్రపతి శివాజి టెర్మినస్ నుంచి మంగళూరు వెళ్లే రైలు ఎక్కాడు. రైలు మహారాష్ట్ర సరిహద్దు దాటింది. అంతలోనే  టికెట్ కలెక్టర్.. రైలు ప్రయాణికులందరినీ టికెట్ చూపించమని అడిగాడు. జెన్ సింగ్‌ను కూడా టికెట్ అడిగాడు. కానీ అతడి వద్ద లేదు. లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. టికెట్ కలెక్టర్‌కు ఏదో తేడాగా అనిపించింది. వెంటనే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత  రైల్వే ఇన్‌స్పెక్టర్ విపిన్ సింగ్ రాణా రైలు ఎక్కి.. జన్‌సింగ్ వద్దకు వెళ్లాడు. టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది. బ్యాగ్‌లో ఏమున్నాయని అడిగితే.. బట్టలు తప్ప ఏమీ లేవని సమాధానం చెప్పాడు. కానీ పోలీసులు నమ్మలేదు. బ్యాగ్ తెరిచి చూస్తే.. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం రూ.2 కోట్ల నగదు ఉందని పోలీసులు తెలిపారు. అవి కూడా.. అన్నీ రూ.2వేల నోట్లే ఉండడం విశేషం. ఆ డబ్బునంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రైలు కర్వార్‌‌లోని శిరవాడ రైల్వే స్టేషన్‌ చేరుకున్న తర్వాత.. రైల్వే పోలీసులు అతడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. అంత డబ్బు ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని కూపీ లాగితే.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. అదంతా హవాలా డబ్బుని.. మంగళూరులో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడని తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒకవేళ జెన్ సింగ్ రైల్వే టికెట్ తీసుకొని ప్రయాణించి ఉంటే.. టికెట్ కలెక్టర్ నిలదీసేవాడు కాదు.. ఈ హవాలా సొమ్ము బయటపడేది కాదు.

First published:

Tags: Indian Railways, IRCTC, Karnataka

ఉత్తమ కథలు