Home /News /national /

RS 2 30 CRORE CASH IN A CAR TYRE SEIZED BY IT OFFICIALS IN KARNATAKA BA

కారు టైరులో నోట్ల కట్టలు.. చూసి షాక్ అయిన ఐటీ అధికారులు

1998లో లోక్‌సభ ఎన్నికల్లో సుమారు రూ.9వేల కోట్లు ఖర్చు అయింది.

1998లో లోక్‌సభ ఎన్నికల్లో సుమారు రూ.9వేల కోట్లు ఖర్చు అయింది.

బెంగళూరు నుంచి శివమొగ్గకు డబ్బును తరలిస్తుండగా.. ఐటీ అధికారులు పట్టుకున్నారు. కారుకు అదనంగా ఉండే టైర్‌లో డబ్బులను దాచి పెట్టారు.

    ఎన్నికల వేళ భారీ ఎత్తున డబ్బులు పట్టుబడుతున్నాయి. బెంగళూరు నుంచి శివమొగ్గకు డబ్బును తరలిస్తుండగా.. ఐటీ అధికారులు పట్టుకున్నారు. కారుకు అదనంగా ఉండే టైర్‌లో డబ్బులను దాచి పెట్టారు. వాటిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అన్నీ రూ.2వేల నోట్లను కారు టైరులో దాచిపెట్టి రవాణా చేస్తుండగా దొరికిపోయారు. కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే రూ.4కోట్లు సీజ్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఈనెల 23న మూడో విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకే ఈ డబ్బును తరలిస్తూ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ వ్యాపారవేత్త వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏ పార్టీకిచెందిన వారు ఉన్నారు? ఏదైనా రాజకీయ పార్టీకి ఇచ్చేందుకు తరలిస్తున్నారా? అని ఎన్నికల అధికారులు ఆరా తీస్తున్నారు.

    First published:

    Tags: Karnataka Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019

    తదుపరి వార్తలు