హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Centre Tells SC : రూ. 19 వేల కోట్ల విజయ్ మాల్యా,నీరవ్,చోక్సీ ఆస్తులు స్వాధీనం

Centre Tells SC : రూ. 19 వేల కోట్ల విజయ్ మాల్యా,నీరవ్,చోక్సీ ఆస్తులు స్వాధీనం

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ,మెహుల్ చోక్సీ(ఫైల్ ఫొటో)

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ,మెహుల్ చోక్సీ(ఫైల్ ఫొటో)

Mallya,Nirav Modi And Choksi Assets : 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(PMLA)తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు ప్రభుత్వం కోర్టుకి తెలిపింది.

Mallya,Nirav Modi And Choksi Assets Attached : భారతీయ బ్యాంకులను వేల కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన రూ.19,111కోట్ల ఆస్తుల్నిఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ఇప్పటి వరకు ఎటాచ్ చేసినట్లు సుప్రీంకోర్టుకు గురువారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రూ.22,500 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన ఈ ముగ్గురు నేరగాళ్లపై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని ప్రభుత్వం తరపున కోర్టులో వాదలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

మనీ ల్యాండరింగ్‌ చట్టంలోని కొన్ని నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎ.ఎం.ఖన్వీల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సకాలంలో తీసుకున్న చట్టపరమైన చర్యల ఫలితంగా ఈ ముగ్గురికి చెందిన రూ.15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు చెప్పారు. ఈ కేసుపై వాదనలు వచ్చే వారం కూడా కొనసాగనున్నాయి.

ALSO READ Explain : జిన్ పింగ్ కు అమెరికా భయం పోయినట్లే..తైవాన్ పై యుద్ధానికి సిద్ధమైన చైనా?

2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(PMLA)తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67వేల కోట్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

First published:

Tags: Assets, Mehul Choksi, Nirav Modi, Supreme Court

ఉత్తమ కథలు