బ్యాంకులను వేల కోట్ల రూపాయలు ముంచేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారిని తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న వీరిని తీసుకొచ్చేందుకు కేంద్రం ఆయా దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే.. వారి నుంచి ఎంత మేర డబ్బును వెనక్కి తీసుకొచ్చారనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. బ్యాంకులకు వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఎంత మొత్తం రికవరీ అయ్యిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మోసాల కేసులో బ్యాంకులకు రూ.18,000 కోట్లు తిరిగి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002కి సంబంధించిన మొత్తం కేసుల్లో రూ.67000 కోట్ల ఆర్థిక నేరాలు ఉన్నాయని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి తుషార్ మెహతా తెలిపారు.
పీఎంఎల్‌ఏ కింద వచ్చిన నేరాల శోధన, స్వాధీనం, దర్యాప్తు, అటాచ్‌మెంట్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందుబాటులో ఉన్న విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం 4700 కేసులను దర్యాప్తు చేస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. గత ఐదేళ్లలో 2105-16లో 111 నుంచి 2020-21లో 981 కేసుల పరిధిలో ఈడీ దర్యాప్తు జరిపిందని ఆయన చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం EDకి దర్యాప్తు, జప్తు, శోధన, ఆస్తులను జప్తు చేసే అధికారాలు ఉన్నాయి.
Omicron: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్.. ఇంకా ఇబ్బంది పడుతున్నా: CJI Ramana వ్యాఖ్యలు
Lakhimpur kheri: భారీ భద్రతతో వెళ్లి ఓటేసిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా.. కొడుకు మాత్రం రాలే
2016 నుంచి 2021 వరకు ఈడీ కేవలం 2086 పీఎంఎల్‌ఏ కేసులను మాత్రమే విచారణకు స్వీకరించిందని, అలాంటి కేసులకు సంబంధించి 33 లక్షల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. పీఎంఎల్‌ఏ కింద ఏటా చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మనీలాండరింగ్ చట్టం కింద ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో 7900 కేసులు, అమెరికాలో 1532 కేసులు, చైనాలో 4691 కేసులు, ఆస్ట్రియాలో 1036 కేసులు, హాంకాంగ్‌లో 1823 కేసులు, బెల్జియంలో 1862 కేసులు, రష్యాలో 2764 కేసులు నమోదవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirav Modi, Supreme Court, Vijay Mallya