హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

RRR Nizam collections: నైజాం గడ్డపై నయా చరిత్ర.. 75 కోట్ల వైపు అడుగులేస్తున్న ‘RRR’..

RRR Nizam collections: నైజాం గడ్డపై నయా చరిత్ర.. 75 కోట్ల వైపు అడుగులేస్తున్న ‘RRR’..

RRR Nizam collections: తెలుగు సినిమాలకు నైజాం మార్కెట్ చాలా పెద్దది. ఒకప్పుడు ఇక్కడ 10 కోట్ల మార్క్ అందుకుంటే వామ్మో అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే 10 కోట్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా మొదటి రోజు 25 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇంకా చదవండి ...

    తెలుగు సినిమాలకు నైజాం మార్కెట్ (Nizam Market) చాలా పెద్దది. ఒకప్పుడు ఇక్కడ 10 కోట్ల మార్క్ అందుకుంటే వామ్మో అనుకునే వాళ్ళు. కేవలం చిరంజీవి (Chiranjeevi) సినిమాలు మాత్రమే ఎక్కువగా 10 కోట్ల మార్కును అందుకునేవి. ఆ తర్వాత మెల్లమెల్లగా మహేష్ బాబు (Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), ప్రభాస్ (Prabhas) లాంటి హీరోలు కూడా నైజాంలో తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా నైజాంలో తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధిస్తున్నాయి. ఒకప్పుడు 10 కోట్లు ఫుల్ రన్‌లో వస్తే గొప్ప అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే 10 కోట్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా మొదటి రోజు 25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తోంది ఈ సినిమా. నైజాంలో ఈ సినిమాను 70 కోట్లకు కొంటే ట్రేడ్ సైతం ఆశ్చర్య పోయింది.

    ఇన్ని డబ్బులు రావాలంటే ఎంతమంది సినిమా చూడాలి.. ఎన్నిరోజులు లాంగ్ రన్ ఉండాలి అంటూ లెక్కలు వేసుకున్నారు. కానీ నాలుగు రోజులు ముగిసేసరికి నైజాం గడ్డపై ఏకంగా 61 కోట్ల షేర్ వసూలు చేసి నయా చరిత్ర సృష్టించింది త్రిబుల్ ఆర్ సినిమా. అసలు కలలో కూడా ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ కురుస్తుంది. నాలుగో రోజు కూడా ఈ చిత్రానికి 8.17 కోట్ల షేర్ వచ్చింది నైజాంలో. అంతేకాదు.. మొదటి 3 రోజులు వరసగా 25 కోట్లు, 15.03 కోట్లు, 15.50 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది.

    AP-TG 4th Day Highest Share Movies: ‘RRR’ తగ్గేదే లే.. నాలుగో రోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాలు ఇవే..

    మరో మొదటి వారమే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది ఈ చిత్రం. అంతేకాదు.. నైజాంలో మొదటి 75 కోట్లు షేర్ సాధించిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించడం ఖాయం. అసలు కలలో కూడా ఈ రికార్డు ఈ మధ్య కాలంలో మరో సినిమాకు సాధ్యం కావడం కష్టమే. బాహుబలి 2 అనుకుంటే.. దాన్ని మించిపోయేలా కలెక్షన్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉండటం.. ఇద్దరికి అదిరిపోయే మార్కెట్ ఉండటం.. దానికి తోడు రాజమౌళి అనే బ్రాండ్ సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది. బాహుబలి 2 సినిమాకు ఐదేళ్ల కింద నైజాంలో 66.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని చాలా మార్జిన్‌తో దాటేలా కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్. మొత్తంగా ఇప్పుడు 90 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది.

    First published:

    ఉత్తమ కథలు