ఆర్పీఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి రైల్వే మంత్రి ఫిదా..క్యాష్ రివార్డ్

భోపాల్‌లో రైలు ఆగడంతో.. పాప తల్లి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ని పిలిచింది. 'సార్.. పాప గుక్కపట్టి ఏడుస్తోంది. పాలు కొందామంటే ఎక్కడా షాప్‌లు తెరిచిలేవు. కాస్త రోడ్డు మీదకు వెళ్లి ..పాల ప్యాకెట్ తెస్తారా.' అని అడిగింది.

news18-telugu
Updated: June 4, 2020, 6:57 PM IST
ఆర్పీఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి రైల్వే మంత్రి ఫిదా..క్యాష్ రివార్డ్
పీయుష్ గోయెల్
  • Share this:
'మీరు దేవుడు సామీ', 'మనసున్న మా రాజు', 'సరిలేరు నీకెవ్వరు'..ఓ ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్‌పై ఇలాంటి ప్రశంసల జల్లే కురుస్తోంది. ఆయన చేసిన పనికి ఏకంగా రైల్వే మంత్రి ఫిదా అయ్యారు. శ్రామిక్ రైల్లో గుక్కపట్టి ఏడుస్తున్న పాప కోసం.. పాల ప్యాకెట్ తెచ్చిన ఆయన పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఓ వైపు రైలు కదులుతున్నా.. వేగంగా పరుగెత్తి కిటికీ నుంచి పాలు అందించిన ఆ కానిస్టేబుల్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాదు ఆయనకు క్యాష్ రివార్డు కూడా ప్రకటించారు రైల్వే మంత్రి.

ఆ రోజు ఏం జరిగిదంటే:
మే 31న బెలగాం నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్ రైలు వెళ్లింది. ఆ రైలులో షరీఫ్ హష్మి, హసిన్ హష్మి దంపతులు తమ నాలుగేళ్ల పాపతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఐతే శ్రామిక్ రైలు ఎక్కడ పడితే అక్కడ ఆగేందుకు అవకాశం లేకపోవడంతో తమ పాపకు పాలు తీసుకోలేకపోయారు. కానీ ఆ చిన్నారి పాల కోసం చాలా సమయం నుంచి ఏడుస్తోంది. భోపాల్‌లో రైలు ఆగడంతో పాలు దొరుకుతాయేమోనని చూశారు. కానీ ఆ ఛాన్స్ లేదు. ఈ క్రమంలో పాప తల్లి.. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ని పిలిచింది. 'సార్.. పాప గుక్కపట్టి ఏడుస్తోంది. పాలు కొందామంటే ఎక్కడా షాప్‌లు తెరిచిలేవు. రైలు కూడా ఆగడం లేదు. కాస్త రోడ్డు మీదకు వెళ్లి .. పాల ప్యాకెట్ తెస్తారా.' అని అడిగింది.

వారి పరిస్థితిని అర్ధం చేసుకున్న కానిస్టేబుల్ ఇందర్ సింగ్ యాదవ్ హుటాహుటిన రోడ్డు మీదకు పరిగెత్తి ఓ పాల ప్యాకెట్ తీసుకున్నాడు. అంతే వేగంతో స్టేషన్‌కు వచ్చాడు. కానీ అప్పటికే రైలు ముందుకు కదులుతోంది. దాంతో ఓ చేత్తో తుపాకీ.. మరో చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని మరింత వేగంతో పరుగు తీశాడు. నేరుగా కోచ్ వద్దకు వెళ్లి కిటికీ నుంచి ఆ తల్లికి పాల ప్యాకెట్ అందజేశాడు. ఆ దృశ్యాలన్నీ స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 4, 2020, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading