8 నెలల గర్భంతో ఆమె ఎందుకలా చేసింది? -అక్కడ RPF పోలీసు లేకుంటే? -మీ జీవితంలోనూ ఇలాంటిది జరిగిందా?- video

సీసీటీవీ ఫొటో

Kalyan railway station : కదులుతోన్న రైలు నుంచి దిగబోయిన ఓ గర్భిణిని రైల్వే పోలీసు కాపాడిన సంఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. ఎనిమిది నెలల గర్భంతో ఆమె అంత రిస్క్ చేయడానికి గల కారణాలు వెల్లడిస్తూ, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను రైల్వే శాఖ విడుదల చేసింది. పోలీసును ప్రశంసిస్తోన్న నెటిజన్లు.. మహిళ విషయంలో మాత్రం భిన్నకామెంట్లు చేస్తున్నారు..

  • Share this:
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరానికి రైల్వే ద్వారం లాంటి ‘కల్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్’లో నిత్యం లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. యూపీ, బీహార్ నుంచి వచ్చే వలస కూలీలు ఈ స్టేషన్ లోనే దిగి ముంబైలోకి ప్రవేశిస్తుంటారు. అలాంటి చోట ప్రమాదాలు జరక్కుండా రైల్వే పోలీసులు పకడ్పందీగా వ్యవహరిస్తుంటారు. అయినాసరే అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా కల్యాణ్ రైల్వే స్టేషన్ లో ఓ గర్భిణిని తృటిలో ప్రాణాపాయం నుంచి కాపాడాడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్..

కదులుతోన్న రైతుల నుంచి దిగబోయిన గర్భిణి జారి కిందపడగా అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ కాపాడాడు. ఆ మహిళ పేరు వందన(21) అని, భర్త చంద్రేశ్, కూతురితో కలిసి ఆమె ముంబై(కల్యాణ్ రైల్వేస్టేషన్) నుంచి గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉందని, అయితే వాళ్లు పొరపాటున వేరే రైలు ఎక్కడం, ఆ విషయం తెలుసుకునేలోపే రైలు కదలడంతో కంగారుగా కిందికి దిగే దుస్సాహసం చేశారు..8నెలల గర్భవతి అయిన వందన కదిలే రైలు నుంచి దిగబోయి పట్టుతప్పి పట్టాల కిందకు పడబోయింది. అయితే, సరిగ్గా అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఖండేకర్ చాకచక్యంగా ఆమెను కాపాడాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పోలీసుల మందలింపు తర్వాత గర్భిణి వందన తన కుటుంబంతో కలిసి గోరఖ్ పూర్ రైలు ఎక్కింది. గర్భినిని ఆర్పీఎఫ్ పోలీసు కాపాడిన దృశ్యాలను సెంట్రల్ రైల్వే పీఆర్వో శివాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కారణం ఏదైనప్పటికీ కదులుతోన్న రైలు నుంచి ఎక్కడం, దిగడం చేయొద్దని రైల్వే అధికారి హెచ్చరించారు.
Published by:Madhu Kota
First published: