హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video : మోదీ-మోదీ నినాదాలతో మారుమోగిన లోక్‌సభ.. పార్లమెంటులో బీజేపీ అసెంబ్లీ విజయోత్సాహం

Video : మోదీ-మోదీ నినాదాలతో మారుమోగిన లోక్‌సభ.. పార్లమెంటులో బీజేపీ అసెంబ్లీ విజయోత్సాహం

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ విక్టరీ క్రెడిట్ మొత్తం మోదీకే ముట్టజెపుతున్నట్లుగా.. ప్రధాని సభలోకి అడుగుపెట్ట‌గానే బీజేపీ ఎంపీలు లేచి నిలబడి, పెద్ద ఎత్తున ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలు చేశారు.

  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత కార్యకలాపాలు సోమవారం మొదలుకాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వస్వాగతం లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని సభకు రాగా, బీజేపీ ఎంపీలు విజయోత్సాహంతో ఊగిపోయారు. ఇటీవల వెల్లడైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ విక్టరీ క్రెడిట్ మొత్తం మోదీకే ముట్టజెపుతున్నట్లుగా.. ప్రధాని సభలోకి అడుగుపెట్ట‌గానే బీజేపీ ఎంపీలు లేచి నిలబడి, పెద్ద ఎత్తున ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలు చేశారు.

  నిమిషాలపాటు మోదీ మోదీ నినాదాలతో సభ హోరెత్తిపోయింది. బీజేపీ ఎంపీలు ఫుల్ జోష్ తో జిందాబాద్ లు కొడుతుండగా, మోదీ ధీమాగా వచ్చి తన స్థానంలో ఆసీనులయ్యారు. కూర్చున్న తర్వాత కూడా మోదీ నినాదాలు ఆగలేదు. ఎంపీలను ఆగమని అనలేని పరిస్థితిలో స్పీకర్ ఓం బిర్లా సైతం చిరునవ్వులు చిందిస్తూ ప్రధాని వంక చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో సభలో అమిత్ షా, రాజ్ నాథ్ తదితర కీలక మంత్రులూ ఉన్నారు. సభను పరిశీలించేందుకు కొందరు విదేశీ అతిథులు కూడా గ్యాలరీల్లో కూర్చోవడం కనిపించింది. మరోవైపు,

  Bahubali-3: 'బాహుబలి-3'పై రాజమౌళి అదిరిపోయే అప్‌డేట్‌.. ఎప్పుడొస్తుందంటే..

  కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సైతం ప్రధాని మోదీని మెచ్చుకున్నారు. యూపీ విజయం ఘనత ప్రధానిదేనన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన శక్తి, చురుకుదనం కలిగిన వ్యక్తి. ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా రాజకీయంగా ఆకట్టుకునేలా పనిచేశారు’ అని జైపూర్ సాహిత్య సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

  Edible Oil Prices: హామీలకు భిన్నంగా భారీగా పెరుగుతోన్న ధరలు -Russia Ukraine warతో ఆర్థిక ప్రమాదం!

  ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారంటూ.. ఏదో ఒక రోజు వారు బీజేపీయే ఆశ్చర్యపోయేలా షాకిస్తారని శశి థరూర్ అన్నారు. అదే సమయంలో ప్రధానిపై విమర్శలను కూడా ఎక్కు పెట్టారు. ‘సమాజంలోకి ఆయన కొన్ని శక్తులను ప్రవేశపెట్టారు. మత, ప్రాంతీయ ప్రాతిపదికన జాతిని విభజించడమే వాటి పని. ఇది దురదృష్టకరం’ అని థరూర్ అన్నారు.

  First published:

  ఉత్తమ కథలు