ROURKELA TRAIN ACCIDENT TWO GOOD TRAINS COLLIDED IN OPPOSITE DIRECTIONS AT KURKURA TRAIN ACCIDENT SK
Train Accident: ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా రెండు రైళ్లు.. చూస్తుండగానే ఘోర ప్రమాదం..
ప్రతీకాత్మక చిత్రం
Jharkhand Train Accident: రెండు రైళ్లు ఒకేట్రాక్‌పై వచ్చే ఛాన్సే లేదు. కానీ ఆ రైళ్లు ఎదురెదురుగా ఎలా వచ్చాయన్నదే ఎవరకీ అర్ధం కావడం లేదు. ఇందులో సాంకేతిక సమస్య ఉందా? లేదంటే స్టేషన్ మాస్టర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందా? అనే దానిపై రాంచీ డివిజన్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఝార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హతియా-రూర్కెలా రైలు మార్గంలో శనివారం రాత్రి రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాత్రి 10 గంటల సమయంలో కురుకురా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ఇంజిన్లు దెబ్బతిన్నాయి. లోకో పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్కలు చేపట్టారు. ఇంజిన్ క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది. అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఒక గూడ్స్ రైలు రూర్కెలా నుండి రాంచీకి వెళ్తుండగా.. మరొక రైలు రాంచీ నుండి రూర్కెలాకు వెళ్తోంది. ఇందులో ఒకటి సరుకుతో వెళ్తుండగా... మరొకటి ఖాళీ బోగీలతో వెళ్తోంది. రైఈ ప్రమాదం కారణంగా హతియా-రూర్కెలా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
రెండు రైళ్లు ఒకేట్రాక్‌పై వచ్చే ఛాన్సే లేదు. కానీ ఆ రైళ్లు ఎదురెదురుగా ఎలా వచ్చాయన్నదే ఎవరకీ అర్ధం కావడం లేదు. ఇందులో సాంకేతిక సమస్య ఉందా? లేదంటే స్టేషన్ మాస్టర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందా? అనే దానిపై రాంచీ డివిజన్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చినప్పటికీ.. బ్రేకులు ఎందుకు పడలేదన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కూడా ప్రమాదానికి ఓ కారణమని అధికారులు భావిస్తున్నారు. అవి గూడ్స్ రైళ్లు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ప్రయాణికుల రైళ్లు అయిఉంటే.. ఎంతటి ఘోరం జరిగేదో ఊహించుకోచ్చు. ఇప్పుడీ ప్రమాదంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. రెండు రైళ్లను ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా ఎలా అనుమతిస్తారని..అధికారులు మరీ అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 12 వేల మంది చనిపోయారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో ఈ విషయం వెల్లడయింది. ఆ నివేదిక ప్రకారం గతేడాది రైలు ప్రమాదాల్లో రోజుకు సగటున 32 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువగా రైలు నుండి పడిపోయి లేదా రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు 8,400 మంది మరణించారని కూడా నివేదికలో చెప్పబడింది. 70శాతం మంది ఇలాగే మరణించారని నేషనల్ క్రైమ్ రికర్డ్స్ బ్యూరో వెల్లడించింది.
మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో రెండో స్థానంలో ఉంది. గత ఏడాది మహారాష్ట్రలో రైలు ప్రమాదాల్లో 1,922 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 1558 మంది మరణించారు. ఇతర రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగే ప్రమాదాల్లో యూపీకి చెత్త రికార్డు ఉంది. కేంద్రం నివేదిక ప్రకారం రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదాల్లో.. ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానంలో ఉంది. ఈ కేటగిరీలో బీహార్ రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.