Atal Tunnel: అక్టోబరు 3న అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ.. ఇవీ ప్రత్యేకతలు

హిమాచల్‌లోని మనాలిని, లద్దాఖ్‌లోని లేహ్‌ను కలిపి ఈ సొరంగం పొడవు 9.02 కి.మీ. ప్రపంచంలో ఇంత పొడవైన సొరంగ రోడ్డుమార్గం ఎక్కడా లేదు.

news18-telugu
Updated: October 1, 2020, 2:37 PM IST
Atal Tunnel: అక్టోబరు 3న అటల్ టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ.. ఇవీ ప్రత్యేకతలు
అటల్ టన్నెల్, ప్రధాని మోదీ
  • Share this:
హిమాచల్ ప్రదేశ్, లేహ వాసుల దశాబ్ధాల కల త్వరలోనే సాకారం కాబోతోంది. అటల్ టన్నెల్ అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచంలోనే పొడవైన సొరంగ రోడ్డు మార్గాన్ని ప్రధాని మోదీ అక్టోబరు 3న ప్రారంభించనున్నారు. రోహతంగ్ వద్ద ఉదయం 10 గంటలకు టన్నెల్ ద్వారా వెళ్లేందుకు బస్సును  జెండా ఊపి ప్రారంభిస్తారు. లాహౌల్ కు చెందిన పలువురు వృద్ధులను బస్సులో చేరవేసి.. ఈ సొరంగం దాటిన మొదటి ప్రయాణికులుగా గౌరవిస్తారు. ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ హైవే మనాలి-లేహ్‌ను కలుపుతుంది.  9.02 కిలోమీటర్ల ఈ సొరంగాన్ని సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో నిర్మించారు.


అటల్ హైవే టన్నెల్ విశేషాలు:
హిమాచల్‌లోని మనాలిని, లద్దాఖ్‌లోని లేహ్‌ను కలిపే ఈ సొరంగం పొడవు 9.02 కి.మీ. ప్రపంచంలో ఇంత పొడవైన సొరంగ రోడ్డుమార్గం ఎక్కడా లేదు.

హిమాలయాల్లోని పిర్‌పంజాల్ పర్వశ్రేణుల్లో అత్యాధునిక టెక్నాలజీ, సదుపాయాలతో సముద్ర మట్టానికి 3వేల మీటర్లు (10వేల అడుగులు) ఎత్తులో నిర్మించారు.

ఈ సొరంగం నిర్మాణంతో మనాలి, లేహ్ మధ్య దూరం 46 కి.మీ. తగ్గుతుంది. ప్రయాణ సమయం 4 నుంచి 5 గంటల వరకు ఆదా అవుతుంది.

అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ మనాలి నుంచి 25 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 3060 మీటర్ల ఎత్తులో ఉంది.నార్త్ పోర్టల్ లాహోల్ స్పితిలోని టెలింగ్ గ్రామంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3071 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ఇది గుర్రపు నాడా ఆకారంలో ఉండే సింగ్ ట్యూబ్ డబుల్ రోడ్ టన్నెల్. రోడ్డు వెడల్పు 8 మీ ఉంటుంది. ఓవర్ హెడ్ క్లియరెన్స్ 5.525 మీ. వరకు ఉంటుంది.

ప్రతి రోజు 3వేల కార్లు, 1500 ట్రక్కులు గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించేలా అటల్ హైవే టన్నెల్‌ను డిజైన్ చేశారు.

సొరంగ మార్గంలో రక్షణ సదుపాయాలు (సేఫ్టీ ఫీచర్స్):

ఇందులో సెమీ ట్రాన్స్‌వర్స్ వెంటిలేషన్ సిస్టమ్, SCADA కంట్రోల్డ్ ఫైర్ ఫైటింగ్, ఇల్యుమినేషన్, మానిటరింగ్ సిస్టమ్‌తో కూడిన ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

ప్రధాన సొరంగం లోపల ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు ప్రతి 60 మీటర్లకు ఒక ఫైర్ హైడ్రాంట్ అమర్చారు.

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం టెన్నెల్ లోపల ప్రతి 150 మీటర్లకు ఒక టెలిఫోన్ అందుబాటులో ఉంటుంది.

సొరంగ మార్గంలో ప్రతి 250 మీటర్లకు సీసీ కెమెరాలతో కూడిన ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే కంట్రోల్‌రూమ్ సిబ్బందిని అలర్ట్ చేస్తుంది.

ప్రతి కిలోమీటర్‌కు ఎయిర్ క్వాలిటీ (గాలి నాణ్యత) మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి 25 మీటర్లకు ఎగ్జిట్ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.

ప్రతి 50 మీటర్లకు ఫైర్ రేట్ డాంపర్లు. ప్రతి 60 మీటర్లకు ఒక కెమెరాను అమర్చారు.

రోహతంగ్ పాస్ కింది భాగంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని 2000, జూన్ 3న నాటి ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి నిర్ణయించారు. సొరంగ నిర్మాణం కోసం 2002, మే 26న సౌత్ పోర్టల్ వద్ద పునాదిరాయి వేశారు. మొదట ఈ టన్నెల్‌ను రోహ్‌తంగ్ టన్నెల్‌గా పిలిచేశారు. ఐతే సొరంగ మార్గ నిర్మాణానికి వాజ్‌పేయీ చేసిన కృషికి గానూ.. దాని పేరును అటల్ టన్నెల్‌గా మార్చారు. 2019, డిసెంబరు 24న కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading