ఎట్టకేలకు చిక్కిన ‘బిన్ లాడెన్‌’ ఏనుగు...

గత అక్టోబర్‌లో ఆ ఏనుగు అసోంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

news18-telugu
Updated: November 11, 2019, 10:32 PM IST
ఎట్టకేలకు చిక్కిన ‘బిన్ లాడెన్‌’ ఏనుగు...
‘బిన్ లాడెన్’గా పిలిచే ఏనుగు
  • Share this:
ప్రపంచాన్ని బిన్ లాడెన్ భయపెట్టినట్టు.. అసోంలోని ఓ గ్రామాన్ని భయపెట్టి ఐదుగురు గ్రామస్తులను చంపిన ఏనుగును అటవీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు.  ఈ భారీ మదగజాన్ని పట్టుకోవడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. భారీ ఆపరేషన్ చేపట్టారు. ‘ఈ రోజు మా ఆపరేషన్‌లో చివరి అంకాన్ని చేపట్టాం. నిపుణులైన షూటర్లు ట్రాంక్విలైజర్లతో రెండు సార్లు కాల్చగానే ఆ ఏనుగుకి మత్తెక్కి పడిపోయింది.’ అని అటవీ అధికారి తెలిపారు. జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు తీస్తున్న ఆ ఏనుగును దూరంగా అడవి మధ్యలోకి వదిలేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ మగ ఏనుగును తలించేందుకు సమాయత్తం అయ్యారు. గత అక్టోబర్‌లో ఆ ఏనుగు అసోంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>