ROBERT VADRA TURNED OUT TO BE A DISTRUBED IN MUMBADEVI TEMPLE IN MUMBAI MK
ఆలయంలో ప్రవేశించిన సోనియా అల్లుడికి చేదు అనుభవం..?
రాబర్ట్ వాద్రా (PTI)
ముంబాదేవి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాబర్ట్ వాద్రాను చూడగానే అక్కడి ఉన్న భక్తుల్లో కొందరు సోనియా అల్లుడు అని గుర్తుపట్టి, మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కొద్దిగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ముంబైలోని ముంబా దేవీ ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబాదేవి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాబర్ట్ వాద్రాను చూడగానే అక్కడి ఉన్న భక్తుల్లో కొందరు సోనియా అల్లుడు అని గుర్తుపట్టి, మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కొద్దిగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వాద్రా ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి కొందరు భక్తులు భారత్ మాతా కీ జై, మోదీ జిందాబాద్ అంటూ చుట్టు ముట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దర్శనం అనంతరం రాబర్ట్ వాద్రా భక్తుల ప్రవర్తనపై మండిపడ్డారు. ఆలయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. అంతేకాదు తాను ఆలయంలో ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని రాజకీయాలు చేసేందుకు కాదని అన్నారు.
ఇదిలా ఉంటే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి కొద్ది కాలంగా కొనసాగుతున్న రభసపై వాద్రా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. దివంగత నేతలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను ప్రధాని హోదాలో రాజీవ్ విహారయాత్రకు వాడుకున్నారని మోదీ చేసిన ఆరోపణలపై సైతం వాద్రా స్పందిస్తూ...రాజకీయాల్లో దిగజారుడుతనం ఉండరాదంటూ ట్వీట్ చేయడం విశేషం. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, ఆయన సతీమణి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.