ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా..మోడీ సర్కార్‌పై విసుర్లు

మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం జైపూర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట రాబర్ట్ వాద్రా, తన తల్లితో కలిసి హాజరయ్యారు. వారి వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయం వద్దకు వచ్చారు.

news18-telugu
Updated: February 12, 2019, 12:36 PM IST
ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా..మోడీ సర్కార్‌పై విసుర్లు
జైపూర్‌లో ఈడీ ఎదుట విచారణకు వస్తున్న రాబర్ట్ వాద్రా
news18-telugu
Updated: February 12, 2019, 12:36 PM IST
అక్రమంగా ఆస్తుల కొనుగోలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జైపూర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆదేశాల మేరకు రాబర్ట్ వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్ వాద్రా కూడా విచారణకు హాజరయ్యారు. వారి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జైపూర్‌లోని జేడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక గాంధీ అనుకూల నినాదాలు, మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

మా తల్లిని వేధించాల్సిన అవసరం ఏంటి?: రాబర్ట్ వాద్రా

ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే ముందు రాబర్ట్ వాద్రా...ఫేస్‌బుక్ వేదికగా నరేంద్ర మోడీ సర్కార్‌పై విరుచుకపడ్డారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని వేధించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని అవినీతి.. ఎన్నికల సమయంలోనే ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు.  మోడీ సర్కారు రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ.. వయోభారంతో బాధపడుతున్న తన తల్లిని ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

రోడ్డు ప్రమాదంలో కుమార్తెను.. డయాబెటిస్‌తో భర్త, ఓ కుమారుడిని కోల్పోయి బాధపడుతున్న తన తల్లికి తోడుగా ఉండడం కోసం తనతో పాటు ఆఫీసుకు రమ్మన్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆమెకు కొంత ఊరట లభిస్తుందని తాను ఆశించానని చెప్పారు. తనతో ఆఫీసులో ఉన్నందుకు గానూ ఇప్పుడు ఆమెపై కూడా నేరాలు మోపి విచారిస్తున్నారని ఆరోపించారు.

తాను ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగిందని మీరు భావిస్తే ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో కాకుండా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక నెల ముందు ఎందుకు విచారిస్తున్నారని ప్రశ్నించారు.  ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోరని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించానని, దేవుడు తమతోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఎంతటి విచారణనైనా తాను ఎదుర్కొంటానని, అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని అని ఫేస్‌బుక్‌లో రాబర్ట్‌ వాద్రా పేర్కొన్నారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...