Home /News /national /

ROAD ACCIDENT IN ASSAM 7 DEAD 20 INJURED AFTER BUS AND TRUCK COLLIDE SK

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. లారీ-బస్సు ఢీ.. ఏడుగురు దుర్మరణం

బస్సును ఢీకొన్న ట్రక్కు

బస్సును ఢీకొన్న ట్రక్కు

అతివేగంతో వెళ్తున్న రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నేషనల్ హైవే-17పై మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఆదివారం దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు రక్తమోడాయి. అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోక్రాఝర్ జిల్లా బోగ్రిబారి ప్రాంతంలో ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. అతివేగంతో వెళ్తున్న రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నేషనల్ హైవే-17పై మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దుబురి మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.


    కర్నాటకలోనూ ఇలాంటి రోడ్డు ప్రమాదమే చోటుచేసుకుంది. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు తాలుకాలోని బిలికేరే గ్రామానికి సమీపంలోని రహదారిపై శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జనుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మ‌ృతులను రాయిచూర్ జిల్లాలోని లింగాసుగూర్ తాలుకాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులకు బళ్లారిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Assam, Road Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు