Home /News /national /

RJD MLA SAUD ALAM REFUSES TO STAND UP FOR VANDE MATARAM IN THE STATE ASSEMBLY VIDEO GORES VIRAL IN SOCIAL MEDIA SK ABH

Vande Mataram: భారత్ హిందూ దేశం కాదు.. అసెంబ్లీ వేదికగా జాతీయ గేయాన్ని అవమానించిన ఎమ్మెల్యే

ఆర్జేడీ ఎమ్మెల్యే సౌద్ ఆలం

ఆర్జేడీ ఎమ్మెల్యే సౌద్ ఆలం

Vande Mataram: బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో వందేమాతరం (Vande Mataram) గేయాన్ని ఆలపించేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు గీతాలపన సమయంలో కనీసం పైకి లేచి నిలబడలేదు.

    బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో వందేమాతరం (Vande Mataram) గేయాన్ని ఆలపించేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు గీతాలపన సమయంలో కనీసం పైకి లేచి నిలబడలేదు. కుర్చీలో కూర్చొని.. అవమానించారర. బీహార్ అసెంబ్లీలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) శాసనసభ్యుడు సౌద్ ఆలం (RJD MLA Saud Alam) "వందేమాతరం" పాటపై వివాదాన్ని రేకెత్తిస్తూ, గౌరవించటానికి నిరాకరించారు. ''భారత్ లౌకిక దేశం. వందేమాతరం జాతీయ గీతం కాదు, జనగణమన జాతీయ గీతం. భారతదేశం ఇంకా హిందూ దేశం కానందున నేను నిలబడలేదు.'' అని ఆయన పేర్కొన్నారు. బీహార్ శాసనసభ వర్షాకాల సమావేశాల చివరి రోజైన 2022 జూన్ 30వ ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Vice President Election : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్



    బీహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు గురువారం చివరి రోజు కార్యక్రమాలు ముగియగానే సభలో వందేమాతరం గేయాన్ని పెట్టారు. ఈ సమయంలో సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌తో సహా సభ్యులంతా లేచి నిలబడ్డారు. కానీ లాలూ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే సౌద్ ఆలం మాత్రం నిలబడకుండా.. అలాగే కూర్చుండిపోయారు. ఎమ్మెల్యే సౌద్ ఆలం జాతీయ గీతం జనగణమనకు లేచి నిలబడ్డారు. కానీ జాతీయ గేయం వందేమాతరం పాడుతున్న సమయంలో మాత్రం లేచి నిలబడలేదు. ఇది హిందూ పాట అని.. తాను లేచి నిలబడబోనని ఆయన స్పష్టం చేశారు. మన దేశం ఇంకా హిందూ దేశంగా మారలేదని తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సౌద్ ఆలం ఠాకూర్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



    సభ్యులంతా సభా ప్రాంగణంలో నుంచి బయటకు రాగానే జాతీయ గీతాన్ని ఎందుకు గౌరవించరని జర్నలిస్టులు ప్రశ్నించారు. భారత్ ఇంకా హిందూ దేశం కాలేదని సౌద్ ఆలం తన చర్యను సమర్థించుకున్నారు. ''వందేమాతరం మన జాతీయ గీతం కాదు. మన జాతీయ గీతం జన గణ మన, అందుకే నేను నిలబడలేదు.'' అని సౌద్ ఆలం స్పష్టం చేశారు. ఆయన తీరుపై బీహార్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సింగ్ మండిపడ్డారు. సౌద్ ఆలమ్‌ మన జాతీయ నాయకులను అవమానపరిచారని.. ఆయపపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తులకు చట్టసభల్లో స్థానం ఉండకూడదని ధ్వజమెత్తారు. ఆర్జేడీ నాయకుడు వందేమాతరాన్ని అగౌరవపరచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ప్రముఖ RJD నాయకుడు అబ్దుల్ బారీ సిద్ధిఖీ వందేమాతరం పఠించడం తన మత విశ్వాసాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ఒకే దేవుడిని విశ్వసించే వ్యక్తులు.. వందేమాతరాన్ని పాడరని సిద్ధిఖీ అప్పట్లో తెలిపారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా ఇలా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bihar, RJD, Vande Mataram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు