Home /News /national /

Bihar: ‘‘ముఖ్యమంత్రి గంజాయి సేవిస్తారు.. ఆయనను అది మానేయమనండి” : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Bihar: ‘‘ముఖ్యమంత్రి గంజాయి సేవిస్తారు.. ఆయనను అది మానేయమనండి” : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

నితీష్​ కుమార్​ (ఫైల్)

నితీష్​ కుమార్​ (ఫైల్)

రాష్ట్ర ప్రజలందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించిన రెండు రోజులకే..  నితీశ్ కుమార్‌ (Nitish Kumar) గంజాయి సేవిస్తారని ఆర్జేడీ ఎమ్మెల్యే రాజవంశీ మహతో సంచలన ఆరోపణలు చేశారు.

    మద్యపానానికి వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ ( (Bihar CM Nitish Kumar)  రాష్ట్ర ప్రజలందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించిన రెండు రోజులకే ఆయనపై ప్రతిపక్ష పార్టీల నేతలు దాడికి దిగారు.  నితీశ్ కుమార్‌ (Nitish Kumar) గంజాయి సేవిస్తారని ఆర్జేడీ ఎమ్మెల్యే రాజవంశీ మహతో (RJD MLA RajaVamshi Mahatho) సంచలన ఆరోపణలు చేశారు. నితీష్ ఆ వ్యసనాన్ని ఎందుకు వదులుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. అది కూడా మత్తు పదార్థం (Intoxicating substance) కిందకే వస్తుందన్నారు. దానిపై కూడా నిషేధం ఉందన్నారు రాజవంశీ మహతో.  రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై ఎమ్మెల్యే రాజవంశీ విలేకరులతో మాట్లాడారు. బిహార్‌లో మద్యపాన నిషేధం (Liquor ban in Bihar) కంటితుడుపు చర్య అని రాజవంశీ మహతో విమర్శించారు. మద్యపాన నిషేధం విషయంలో సీఎం నితీశ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బిహార్‌లో పేరుకే మద్యపాన నిషేధమని.. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో, నగరంలో మద్యం దొరుకుతోందని అన్నారు.

    బిహార్‌లో లిక్కర్ దందా..

    బిహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉంటే... మద్యం ముట్టుకోమని నితీశ్ (Nitish Kumar) ప్రజలతో బలవంతంగా ఎందుకు ప్రతిజ్ఞ చేయిస్తున్నారని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయన మాత్రం తన గంజా (cannabis) అలవాటును ఎందుకు మానుకోవట్లేదని అన్నారు. బిహార్‌లో లిక్కర్ దందాను కొన్ని మాఫియాలు నడిపిస్తున్నాయని రాజవంశీ మహతో ఆరోపించారు. అమాయక పేద ప్రజలపై చర్యలు తీసుకునే పోలీసులు ఆ మాఫియాపై మాత్రం చర్యలు తీసుకోవట్లేదన్నారు.

    జీవితాంతం మద్యంకి దూరంగా ఉంటామని..

    నితీశ్‌పై రాజవంశీ మహతో చేసిన ఆరోపణలతో బిహార్ (Bihar) రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.  జేడీయూ నేతలెవరూ మహతో వ్యాఖ్యలపై స్పందించలేదు. కాగా, శుక్రవారమే (నవంబర్ 26) సీఎం నితీశ్ మద్యపానానికి వ్యతిరేకంగా (Liquor) రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. 'జీవితాంతం మద్యపానానికి దూరంగా ఉంటామని..' అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో కల్తీ మద్యం బారినపడి పదుల సంఖ్యలో మరణాలు సంభవించిన నేపథ్యంలో సీఎం ఈ ప్రతిజ్ఙ చేయించారు.

    సీఎం చొరవతో రాష్ట్ర డీజీపీ సందీప్‌ కుమార్‌ సింఘాల్ (DGP Sandeep Kumar Singhal).. తన సహొద్యోగులతో కలిసి.. మద్యాన్ని జీవితంలో ముట్టబోనని (don’t take alcohol) ఇటీవలె ప్రమాణం చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. పట్నాలోని పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలో ఈనెల 26న ఈ కార్యక్రమం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించే పోలీసు (police) సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని డీజీపీ (DGP) స్పష్టం చేశారు. ఆయన ప్రమాణం చేస్తూ.. ‘సందీప్ కుమార్ సింఘల్ అనే నేను.. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని, జీవితంలో దానిని ఎప్పుడూ ముట్టనని ఈరోజు (నవంబర్ 26) ప్రమాణం చేస్తున్నాను. విధుల్లో ఉన్నా, లేకపోయినా.. నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. రోజువారీ జీవితంలో లిక్కర్ కు తావివ్వను. మద్యపాన నిషేధ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తాను‘ అని డీజీపీ ప్రమాణం చేశారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bihar, Ganja case, Nitish Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు