RJD CHIEF LALU PRASAD YADAV HEALTH DETERIORATES LIKELY TO BE SHIFTED TO DELHI AIIMS VIA AIR AMBULANCE MKS
Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. హెలికాప్టర్లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు!
ఆస్పత్రిలో లాలూ (పాత ఫొటో)
లాలూ ప్రసాద్ యాదవ్ (73) ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం ఆయనను రాంచీ రిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ తరలించేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (73) ఆరోగ్యం మరింత క్షీణించింది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన దాదాపు నెలరోజులకుపైగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కానీ మందులకు మెరుగైన ఫలితాలు రాకపోగా, వృద్ధ నేత ఆరోగ్యం ఆందోళనకర దిశగా వెళుతున్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్యం క్షీణిస్తున్నక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను రాంచీ రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించాలని వైద్య బృందం సమాలోచనలు చేస్తున్నది. మెరుగైన చికిత్స కోసం లాలూను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
లాలూ ఖైదీ కావడంతో రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై తరలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 21న లాలూ ప్రసాద్ బ్లడ్ షుగర్, బీపీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, షుగర్ లెవల్స్ కూడా ఉదయం కంటే మధ్యాహ్నానికి పెరిగాయని డాక్టర్ విద్యావతి తెలిపారు. లాలూ కోసం రిమ్స్ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. లాలూ కొంతకాలంగా కిడ్ని సమస్యతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్నారు.
దాణా కుంభకోణానికి సంబందించి ఐదో కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు గత నెలలలో శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు శిక్ష విధించింది. ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. 1990 సంవత్సరంలో లాలూ సీఎంగా ఉన్నప్పుడు డోరండా ట్రెజరీ నుంచి రూ.950 కోట్ల స్కామ్ జరిగినట్లు నిరూపణ అయింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.