Sulthana Begum ShaikSulthana Begum Shaik
|
news18-telugu
Updated: February 26, 2019, 8:45 AM IST
Rising India
ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వేడి... మరోవైపు కాశ్మీర్లో ఉగ్రదాడి... దేశమంతా రాజకీయ హడావుడి... వీటితో పాటు దేశం ముందు పలు రంగాలకు సంబంధించి అనేక సవాళ్లు... వీటన్నింటిపై అన్ని వర్గాలు సమగ్రంగా చర్చించి, మేథోమథనం చేసేందుకు న్యూస్18 నెట్వర్క్ సమోన్నత వేదికను ఏర్పాటు చేయనుంది. అదే రైజింగ్ ఇండియా సమ్మిట్-2019(Rising India Summit 2019). ఫిబ్రవరి 25న దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. దేశంలోని విభిన్న ప్రాంతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై.. తమ గళాన్ని వినిపించారు.
దేశంలోని అతిపెద్ద మీడియా నెట్వర్క్ అయిన న్యూస్ 18 నిర్వహిస్తున్న Rising India Summit 2019 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానోపన్యాసం చేశారు. దేశంలోని ఉద్యోగ, ఉపాధిపై ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో భవిష్యత్తులో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు మోదీ. ఏవియేషన్ రంగంలో నేడు ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది. గతేడాది 9లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పింది.
దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 'బియాండ్ పాలిటిక్స్: డిఫైనింగ్ నేషనల్ ప్రియారిటీస్' అనే థీమ్‌తో ఈ సమ్మిట్ జరగనుంది.
రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు పార్టీలకు చెందిన దిగ్గజ నేతలు, యువనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎంపీ సీఎం కమల్ నాథ్, ఆధ్యాత్మిక గురువు సద్గురు, యోగా గురు రాందేవ్ బాబ వంటి ప్రముఖులు ఢిల్లీలోని జరిగిన రైజింగ్ ఇండియా సమ్మిట్-2019లో తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.
రెండో రోజు .... రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అమిత్ షా, దీపికా పదుకొణె, తాప్సి పన్ను, మేరికోమ్, అనిల్ కుంబ్లే , కమల్ హాసన్, కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్ రాజవర్థన్ రాథోడ్, బీజేపీ స్మృతి ఇరాని, రామ్ మాధవ్, రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా హాజరవుతున్నారు. ఇవాళ జరగనున్న కార్యక్రమంలో నాయకులు, సినీ సెలబ్రిటీలో తమ తమ అభిప్రాయుల్ని పంచుకోనున్నారు.
ఇవికూడా చదవండి:
Rising India Summit 2019 : జాబ్స్ నుంచీ జన్ ధన్ వరకూ... ప్రధాని మోదీ ప్రసంగంలో టాప్ టెన్ అంశాలుPhotos: న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్-2019
Rising India 2019: రైతులకు లక్షల్లో అప్పులుంటే రూ.6వేలు ఇస్తారా? మోదీపై కమల్‌నాథ్ విమర్శలు
First published:
February 26, 2019, 8:08 AM IST