RIP Arun Jaitley : అరుణ్ జైట్లీకి ప్రముఖుల సంతాపం... ఎయిమ్స్‌కి తరలివస్తున్న నేతలు

RIP Arun Jaitley : ఈనెల ఆరో తేదీన కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మరికొన్ని రోజుల్లోనే మరో కీలక నేత చనిపోవడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 1:31 PM IST
RIP Arun Jaitley : అరుణ్ జైట్లీకి ప్రముఖుల సంతాపం... ఎయిమ్స్‌కి తరలివస్తున్న నేతలు
అరుణ్ జైైట్లీ
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దేశ రాజకీయాల్లో ఆయన చేసిన సేవల్ని వారు స్మరించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. అరుణ్ జైట్లీ భార్య సంగీత, కొడుకు రోహన్‌కు కాల్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... తన సంతాపాన్ని తెలిపారు. ఐతే... వారు మాత్రం ఈ కారణం... ప్రధాని మోదీ విదేశీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకోవద్దని కోరారు. ప్రస్తుతం మోదీ అబూదాబీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌కి రాజకీయ నేతలు, ప్రముఖులు తరలి వస్తున్నారు. దీంతో ఎయిమ్స్ దగ్గర ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో... అక్కడి పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఎయిమ్స్ దగ్గర తాకిడి పెరిగింది.
 అరుణ్ జైట్లీ వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. అరుణ్ జైట్లీకి సీరియస్‌గా ఉందనే విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈనెల 9న ఎయిమ్స్‌కు వెళ్లారు. అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల ఆరో తేదీన కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మరికొన్ని రోజుల్లోనే మరో కీలక నేత చనిపోవడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు