Home /News /national /

RILS JIOGENNEXT HAS INCUBATED AND AIDED 170 STARTUPS RAISED FUNDS OVER RS 2600 CRORE UMG GH

RIL's JioGenNext: స్టార్టప్ కంపెనీలకు బెస్ట్ సపోర్టింగ్‌గా రిలయన్స్.. ఎన్ని వేల కోట్ల రూపాయలో తెలిస్తే షాక్ అవుతారు..!

స్టార్టప్ కంపెనీలకు బెస్ట్ సపోర్టింగ్‌గా రిలయన్స్..

స్టార్టప్ కంపెనీలకు బెస్ట్ సపోర్టింగ్‌గా రిలయన్స్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL)కు చెందిన స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ JioGenNext.. 2014 నుంచి 170 స్టార్టప్‌లకు సపోర్ట్‌ చేసింది. ఈ ఎర్లీ స్టేజ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ప్రారంభం నుంచి దాదాపు రూ.2,600 కోట్లు సమీకరించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పని చేస్తోంది. తాజాగా విడుదల చేసిన సమగ్ర వార్షిక నివేదికలో స్టార్టప్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL)కు చెందిన స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ JioGenNext.. 2014 నుంచి 170 స్టార్టప్‌లకు సపోర్ట్‌ చేసింది. ఈ ఎర్లీ స్టేజ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ప్రారంభం నుంచి దాదాపు రూ.2,600 కోట్లు సమీకరించింది. రిలయన్స్ సోమవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వార్షిక నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. ఈ ఇంక్యుబేటర్‌ ప్రోగ్రామ్‌ స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి 12,153 దరఖాస్తులను స్వీకరించింది. స్టార్టప్ అల్యూమిని వెంచర్‌ ప్రారంభం నుంచి రూ.2,600 కోట్లకు పైగా సేకరించింది.

* స్టార్టప్‌లకు ప్రారంభ దశ నుంచే సపోర్ట్‌
ప్రారంభదశలోనే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ JioGenNext ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో టాప్ మేనేజ్‌మెంట్ సభ్యులు ప్రెసిడెంట్ & చీఫ్ ఆఫ్ స్టాఫ్ B.శ్రీనివాసన్, గ్రూప్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్ రోహిత్ బన్సల్, Jioలో చీఫ్ డేటా సైంటిస్ట్ శైలేష్ కుమార్ వంటివారు మెంటార్‌లుగా ఉన్నారు. ఇతర మెంటార్‌లలో హప్టిక్‌కు చెందిన ఆక్రిత్ వైష్, రెవెరీకి చెందిన అరవింద్ పాణి, ఫైండ్‌కు చెందిన హర్ష్ షా, నౌఫ్లోట్స్‌కు చెందిన జస్మిందర్ సింగ్ గులాటి వంటి RIL-బ్యాక్డ్‌ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు ఉన్నారు.

ఇదీ చదవండి: వామ్మో వీడు మామూలోడు కాదయ్యో.. ఏకంగా సీఎం ఫొటోతోనే కోట్లు కొల్లగొట్టడానికి రెడీ ! చివరికి ఏమైందంటే ?


JioGenNext ప్రారంభం నుంచి ఇండియా ఎంటర్‌ప్రెన్యూరియల్‌ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తోందని, రిలయన్స్ ఎకోసిస్టమ్‌లో వాటిని ప్రారంభించడం ద్వారా చాలా స్టార్టప్‌లకు స్కేల్‌ లభించిందని నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2021-22లో, JioGenNext దాని మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్(MAP 2021)ని 11 హై పొటెన్షియల్ స్టార్టప్‌లు, ఆర్కా రీసెర్చ్, బిగ్‌థింక్స్, ఆటమ్, ఫార్మ్, నవనా, జనిత్రి, ఐబోసన్ ఇన్నోవేషన్స్, ఫార్మోనాట్, నిరోగ్యన్, విడ్‌కేర్, వాకావ్‌లతో ప్రారంభించింది.

* ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్‌ అథారిటీతో పార్ట్నర్‌షిప్
MAP ప్రస్తుతం యాన్యువల్ కొహర్ట్ మోడల్‌లో పనిచేస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ఏడాది పొడవునా రోలింగ్ ప్రాతిపదికన తీసుకుంటారు. ఈ ప్రోగ్రామ్‌ ఇప్పటివరకు దాదాపు 90 మంది మెంటార్‌లు, 30 మంది కార్పొరేట్ భాగస్వాములతో 16 కొహర్ట్‌లను నిర్వహించింది. MAPతో స్టార్టప్‌లకు విలువ జోడించడం, మరింత బలోపేతం చేయడం, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో విన్-విన్ భాగస్వామ్యాలను నిర్మించడం జోడింపును లక్ష్యంగా పెట్టుకుంది. MAP రిలయన్స్ / జియో ఎకోసిస్టిమ్‌లో ఎంట్రప్రెన్యూర్‌లను కనెక్ట్ చేయడంపై దృష్టి పెడుతుంది. ప్రొడక్ట్‌ ఆవిష్కరణ, గో-టు-మార్కెట్ ప్లాన్, రిక్రూటింగ్, మార్కెటింగ్, ఫండింగ్, ప్రొడక్ట్-మార్కెట్ ఫిట్‌పై వ్యాపారాలకు సహాయం చేస్తుంది.



ఇవన్నీ స్టార్టప్ మొత్తం బిజినెస్‌ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడతాయి. గత సంవత్సరం, ఆర్‌ఐఎల్ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ (IIA) స్పాన్సర్ చేసిన ఇంక్యుబేటర్‌లో అవర్ క్రౌడ్, యిస్సుమ్, హిబ్రూ విశ్వవిద్యాలయం, బెన్-గురియన్ విశ్వవిద్యాలయంతో కలిసి భాగస్వామ్యమైంది.
Published by:Mahesh
First published:

Tags: Business, Jio, Reliance, Start-Up

తదుపరి వార్తలు