మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్... రైల్లో మీ వెంట సైకిల్ తీసుకెళ్లొచ్చు...

పెద్ద పెద్ద సైకిళ్లు కాకుండా, చిన్న సైకిల్, స్మార్ట్ సైకిల్ (మడిచి పెట్టడానికి వీలుగా ఉండేవి), సులువుగా మోసుకుని వెళ్లగలిగేవి మాత్రమే మెట్రోలో తీసుకుని వెళ్లడానికి అనుమతిస్తారు.

news18-telugu
Updated: February 14, 2020, 9:39 PM IST
మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్... రైల్లో మీ వెంట సైకిల్ తీసుకెళ్లొచ్చు...
చెన్నై మెట్రోలో కొత్త సదుపాయం
  • Share this:
ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది చెన్నై మెట్రో. ప్రయాణికులు తమ వెంట తమ సైకిల్‌ను కూడా తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 14, 2020) నుంచే ఈ కొత్త అవకాశాన్ని కల్పించింది. చెన్నై మెట్రో అందించిన ఆఫర్ ప్రకారం... ఎవరైనా ఓ ప్రయాణికుడు తన ఇంటి వద్ద నుంచి మెట్రో స్టేషన్ వరకు సైకిల్‌ తీసుకొస్తే అతడు ఆ సైకిల్‌ను మెట్రో స్టేషన్‌లోకి తీసుకుని వెళ్లొచ్చు. మెట్రో రైల్లో కూడా తన వెంట తీసుకుని వెళ్లొచ్చు. తన గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మళ్లీ మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసు వరకు లేదా ఇంటి వరకు ఆ సైకిల్ మీద వెళ్లొచ్చన్నమాట.

చెన్నై మెట్రో ఆఫర్


దేశంలో ఇలా సొంత సైకిళ్లను కూడా మెట్రోలో అనుమతివ్వడం ఇదే తొలిసారి. పర్యావరణాన్ని ప్రేమించే వారు, సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి కూడా మంచిదని భావించే వారికి ఇదొక మంచి అవకాశం. ఇప్పటి వరకు ఎవరైనా ప్రయాణికులు తమ ఇల్లు లేదా ఆఫీసు నుంచి వాహనాల్లో మెట్రో స్టేషన్ వరకు వస్తే వారు పార్కింగ్ ప్లేస్‌లో వాహనాలను పెట్టి, ఆ తర్వాత మళ్లీ తిరుగు ప్రయాణంలో తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు సైకిళ్లను మెట్రోలో తీసుకుని వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంతో ఎక్కువ మంది మోటారు వాహనాలను వదిలిపెట్టి సైకిల్ ఎక్కేందుకు ఆస్కారం ఉంటుందని అంచనా. అయితే, పెద్ద పెద్ద సైకిళ్లు కాకుండా, చిన్న సైకిల్, స్మార్ట్ సైకిల్ (మడిచి పెట్టడానికి వీలుగా ఉండేవి), సులువుగా మోసుకుని వెళ్లగలిగేవి మాత్రమే మెట్రోలో తీసుకుని వెళ్లడానికి అనుమతిస్తారు.అయితే, ఆఫీసుకు వెళ్లే సమయాలు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయాల్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనుషులు ఎక్కడానికే చోటు ఉండదు. అయితే, పాసింజర్లతో పాటు వారి సైకిళ్లకు కూడా మెట్రోలో చోటు దక్కాలంటే ఎలా ఉంటుందో చూడాలి. దీనికి తోటి ప్రయాణికుల రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు