కుక్కకు దుప్పటి కప్పి కాపాడిన రిక్షావాలా... నెటిజన్లు ఫిదా...

ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని. ఇంకా బతికేవుంది. అప్పుడప్పుడూ కనిపిస్తోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దృశ్యం.

news18-telugu
Updated: January 6, 2020, 10:31 AM IST
కుక్కకు దుప్పటి కప్పి కాపాడిన రిక్షావాలా... నెటిజన్లు ఫిదా...
కుక్కను కాపాడిన రిక్షావాలా (credit - twitter - Werindia)
  • Share this:
రిక్షాలో కుక్క... దాని చుట్టూ దుప్పటి... కుక్కను రిక్షాలో తీసుకెళ్తున్న రిక్షావాలా. ఈ దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. ఎంతో మందిని కదిలిస్తోంది. అందరూ ఆ రిక్షావాలాను మెచ్చుకుంటున్నారు. ఇది జరిగింది ఢిల్లీలో. ఆల్రెడీ అక్కడ అత్యల్ప (కనిష్ట) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆరు నుంచీ 8 డిగ్రీలు మాత్రమే ఉంటున్నాయి. ఇలాంటప్పుడు మనుషులైన మనమే చలిని తట్టుకోలేకపోతున్నాం... మరి మూగ జీవాల పరిస్థితేంటి? అని ఆలోచించాడు ఆ రిక్షావాలా. తన పెంపుడు కుక్క చలితో బాధపడుతోందని గ్రహించి... దానికి దుప్పటి చుట్టాడు. రిక్షాలో తీసుకెళ్లాడు. ఇప్పుడీ దృశ్యాల్ని చూసి... అందరూ అతని మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు. సో... మానవత్వం చచ్చిపోలేదనీ... ఇలాంటి వ్యక్తుల రూపంలో బతికే ఉందని అనుకోవచ్చు.

కుక్కను కాపాడిన రిక్షావాలా (credit - twitter - Werindia)


కుక్కను కాపాడిన రిక్షావాలా (credit - twitter - Werindia)


First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు