హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Richa Chadda: ఇండియన్ ఆర్మీపై బాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు..

Richa Chadda: ఇండియన్ ఆర్మీపై బాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు..

రిచా చద్దా

రిచా చద్దా

Richa Chadha: 2020 జూన్‌లో లద్దాఖ్‌ సరిహద్దులోని గాల్వన్ లోయలో చైనా, భారత సైన్యాలు ఘర్షణ పడ్డాయి. నాటి ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌ సహా 20 మంది సైనికులు అమరులయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత సైన్యం(Indian Army)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు బాలీవుడ్ నటి రిచా చద్దా (Richa Chadha). గాల్వన్ లోయ ఘర్షణ (Galwan Valley పై ఆమె చేసిన కామెంట్స్‌పై పలు రాజకీయ పార్టీలతో పాటు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. భారత దేశంలో ఉంటూ.. ఆ దేశ సైన్యంపై అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుండాలి..? అని విరుచుకుపడుతున్నారు. ట్విటర్‌లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో ఎట్టకేలకు రిచా చద్దా స్పందించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. తమ కుటుంబ సభ్యులు కూడా ఆర్మీలో పనిచేశారని పేర్కొన్నారు. తన పాత పోస్ట్‌ను తొలగించారు.

అసలేం జరిగిందంటే...?

కొన్ని రోజుల క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (Pok)పై నార్తర్న్ ఆర్మీ కమాండర్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నట్లుగా అందులో ఉంది.  ఆ ట్వీట్‌ను కోట్ చేస్తూ..  బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించారు.

Galwan says Hi అంటూ రీట్వీట్ చేశారు రిచా  చద్దా. ఐతే ఆమె ఉద్దేశం ఏంటో గానీ.. గాల్వన్ లోయ ఘర్షణ గురించి అందులో కామెంట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబట్టుతున్నారు. బీజేపీ , శివసేన నేతలు కూడా రిచా చద్దాపై మండిపడ్డారు.

పిటిషనర్‌ను అభినందించిన కోర్టు.. కానీ మొబైల్‌ గార్డెన్స్‌కు నో.. ఎందుకంటే..

దేశ సైన్యాన్ని , భద్రతా బలగాను దేశ ప్రజలు గౌరవిస్తారని.. ఆర్మీ చీఫ్ ఏం చేసినా దానిని గౌరవిస్తారని బీజేపీ పేర్కొంది. ఈ తరహా పోస్టులతో ఆర్మీని అవహేళన చేయడం దురదృష్టకరమని మండిపడింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి..ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.  జాతి వ్యతిరేక పోస్టులు చేసే వారిపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది.

కాగా, 2020 జూన్‌లో లద్దాఖ్‌ సరిహద్దులోని గాల్వన్ లోయలో చైనా, భారత సైన్యాలు ఘర్షణ పడ్డాయి. నాటి ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌ సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. తమ సైనికులు నలుగురే మరణించారని చైనా ప్రకటన చేసింది. కానీ భారత సైనికుల ఎదురుదాడిలో దాదాపు 40 మంది చైనా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

First published:

Tags: Bollywood, Indian Army

ఉత్తమ కథలు