Home /News /national /

RGSA CENTER APPROVES REVIVAL OF RASHTRIYA GRAM SWARAJ ABHIYAN SCHEME CABINET LATEST DECISION HERE ARE THE FULL DETAILS GH VB

Central Cabinet | Modi : మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. మళ్లీ ఆ పథకం పునరుద్ధరణ..

ప్రధాని మోదీ(file)

ప్రధాని మోదీ(file)

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) పునరుద్ధరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ప్రధాని మోదీ(Modi) అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) పునరుద్ధరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పంచాయతీరాజ్ సంస్థల (PRI) పాలనా సామర్థ్యాలను మరింత అభివృద్ధి(Development) చేయడం కోసం ఈ పథకాన్ని 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2026 వరకు అమలు చేయనున్నారు. ఈ పథకం మొత్తం ఆర్థిక వ్యయం రూ.5911 కోట్లలో కేంద్ర వాటా రూ.3700 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ.2211 కోట్లు. RGSA పథకం పునరుద్ధరణతో దేశంలోని సాంప్రదాయ సంస్థలతో సహా 2.78 లక్షలకు పైగా ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలకు అందుబాటులో ఉన్న వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడంపై దృష్టి సారించవచ్చు. అలాగే సమగ్ర స్థానిక పాలన ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (SDGలను) సాధిస్తూ పాలనా సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది.

పాకిస్తాన్ నుంచి ఇండియాకు డ్రగ్స్.. వారికి ప్రతిరోజూ ఇదే పని.. స్మగ్లింగ్ ఇంత ఈజీనా?

గ్రామీణ స్థాయిలో శిక్షణ, శిక్షణా మాడ్యూల్స్, మెటీరియల్స్‌తో సహా అన్ని సామర్థ్యాలను పెంపొందించే విధంగా విధానాలు రూపొందించడం.. లింగ సమానత్వంతో పాటు సుదూర మొదటి సార్వత్రిక కవరేజీని చేరుకోవడం వంటివి SDG ముఖ్య సూత్రాలుగా పొందుపర్చారు.

ఈ పథకం ద్వారా ప్రధానంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన గ్రామం, పిల్లలకు అనుకూలమైన గ్రామం, గ్రామంలో సరిపోయే నీరు, స్వచ్ఛమైన, ఆకుపచ్చ గ్రామం, గ్రామంలో స్వయం సమృద్ధిగా మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, సుపరిపాలన తదితర అంశాలు గ్రామ అభివృద్ధికి నాంది పలకనున్నాయి.

గ్రామ పంచాయతీలకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అట్టడుగు వర్గాలకు పంచాయతీ రాజ్ సంస్థలు దగ్గరకు చేరాయి. అలాగే సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధితో పాటు సమానత్వం, సమగ్రతను ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడనుంది.

PRIల ద్వారా ఇ-గవర్నెన్స్‌ని పెంపొందించడంతో మెరుగైన సర్వీస్ డెలివరీతో పాటు పారదర్శకతను సాధించడంలో సహాయపడుతుంది. పౌరులను ముఖ్యంగా బలహీన వర్గాలను సామాజికంగా చేర్చుకోవడంతో సమర్థవంతమైన సంస్థగా పనిచేయడానికి ఈ పథకం ఉపయోగపడుతూ గ్రామసభలను బలోపేతం చేస్తుంది. ఇది తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలతో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో PRIల సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది.

PM Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం..

దేశవ్యాప్తంగా సాంప్రదాయ సంస్థలతో సహా గ్రామీణ స్థానిక సంస్థలలో ఎన్నికైన 60 లక్షల మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర వాటాదారులు ఈ పథకం ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉండనున్నారు. పునరుద్ధరించబడిన RGSA పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాఖలను కలిగి ఉంటాయి. కేంద్ర శాఖలకు భారత ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. జమ్మూ కాశ్మీర్‌, కొండ ప్రాంతాల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం (UT) మినహా రాష్ట్ర శాఖలకు నిధులు 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కేటాయించనున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం నిధులను కేంద్రమే సమకూర్చనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Central Government, Pm modi

తదుపరి వార్తలు