పూర్వకాలంలో మన దేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. వారి కొందరు రాజులు ప్రజల్లో మనసుల్లో దేవుడిగా ముద్రవేసుకున్నారు. మరికొందరు మాత్రం విలన్‌లుగా మిగిలిపోయారు. యూపీలోని కన్నౌజ్ జిల్లాలో కూడా ఓ రాజు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన పేరు రాజా జైచంద్. ఇప్పటికీ చాలా మంది ప్రజలు రాజాజైచంద్‌ను దేశద్రోహిగా భావిస్తారు. కానీ కన్నోజ్ వాసులకు ఇది నచ్చదు. చరిత్రలో ఆయన్ను తప్పుడు వ్యక్తిగా చూపించారని.. కానీ అందులో నిజం లేదని కన్యాకుబ్జ్ కమిటీ వాదిస్తోంది. ఎవరైనా ఆయన్ను దేశద్రోహి అని నిరూపిస్తే.. 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని సవాల్ విసురుతోంది.
జైచంద్ ఉత్తర భారతదేశానికి రాజు. ఆయన క్రీ.శ.1170 ప్రాంతంలో జన్మించారు. గంగా నది ఒడ్డున ఉన్న ప్రాంతాలను పరిపాలించేవారు. జైచంద్ రాజుకు ఇద్దరు సంతానం. కుమారుడి పేరు హరిశ్చంద్ర. కూతురి పరు సంయోగిత. ఆనాటి గొప్ప చక్రవర్తుల్లో ఒకరైన పృథ్వీరాజ్ చౌహాన్.. రాజా జైచంద్ అందమైన కుమార్తె సంయోగిత పట్ల ఆకర్షితుడయ్యారు. సంయోగితను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ జైచంద్ రాజుకు పృథ్వీరాజ్ చౌహాన్ నచ్చలేదు. ఐతే పృథ్వీరాజ్ తన శక్తి యుక్తులను ఉపయోగించి.. రాజమందిరం నుంచే సంయోగితను కిడ్నాప్ చేశారు. ఈ పరిణామం తర్వాత జైచంద్ రాజ్ కోపంతో రగిలిపోయారు. పృథ్వీరాజ్ చౌహాన్‌ను బద్ధ శత్రువుగా పరిగణించారు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాజా జైచంద్ మొహమ్మద్ ఘోరీతో స్నేహం చేశారు. జైచంద్ స్నేహం తర్వాత... పృథ్వీరాజ్ చౌహాన్‌పై మహమ్మద్ ఘోరీ దాడి చేశాడు. పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించి బందీగా తీసుకున్నాడు. ఆ తర్వాతే.. ముస్లిం సామ్రాజ్యం దేశమంతటా విస్తరించింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ దేశద్రోహి అనే ముద్రపడింది. మహమ్మద్ ఘోరీతో స్నేహం చేయడం వల్లే.. మనదేశం ముస్లిం పాలనలోకి వెళ్లిపోయిందని ప్రజలు నిందలు వేశారు. రాసో అనే పుస్తకంలో హిందువులను మోసం చేసిన దేశద్రోహిగా రాజా జైచంద్‌ను పేర్కొన్నారు.
Jammu and kashmir: చీనాబ్ వంతెనను పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..
నేటికీ కన్నౌజ్‌లో జైచంద్ రాజు కోట ఉంది. ఇక్కడ రాజా జైచంద్ విగ్రహం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు జైచంద్ రాజు జ్ఞాపకార్థం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి చరిత్రకారులు, మేధావులు పాల్గొంటారు. చరిత్ర పుటల్లో రాజా జైచంద్ చరిత్రను తారుమారు చేశారని కొందరు చరిత్ర కారులు వాదిస్తున్నారు. అందువల్ల ఆయన చరిత్రను మార్చాల్సి ఉందని... ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆయన మానసిక స్థితిని తప్పుగా అర్థం చేసుకొని.. దేశద్రోహిగా ముద్రవేశారని.. ఇది తప్పు అని అంటున్నారు. ఎవరైనా జైచంద్ రాజును దేశద్రోహి అని లాజిక్‌గా నిరూపిస్తే... కన్నౌజ్‌లోని కన్యాకుబ్జ్ కమిటీ నగదు బహుమతి ఇస్తుందని సవాల్ విసురుతున్నారు.
చరిత్రకారుడు సుశీల్ రాకేష్ కూడా కన్నౌజ్ రాజు జైచంద్‌పై పుస్తకం రాశారు. అందులో కన్నౌజ్ రాజును గొప్ప యోధుడిగా, అత్యంత శక్తివంతమైన హిందూ చక్రవర్తిగా అభివర్ణించాడు. గంగా నది ఒడ్డున ఉన్న ప్రాంతాలకు రాజుగా ఉన్న రాజా జైచంద్... బనారస్‌లో బనారస్ ఆలయాన్ని నిర్మించారని, అయోధ్యలోని రామ మందిరంలో కూడా పాత్ర పోషించారని చెప్పారు. జైచంద్ రాజు హిందుత్వం గురించి భిన్నంగా ఆలోచించారని అన్నారు. పృథ్వీరాజ్ రాసో మినహా ఏ చరిత్రలోనూ రాజా జైచంద్‌ని తప్పుగా చూపించలేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ ఆయన్ను దేశద్రోహిగా కొందరు భావించడం.. వారి మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Up news, Uttar pradesh