పారా మిలిటరీ బలగాలకు కేంద్రం గుడ్‌న్యూస్

CRPF, BSF, ITBP, SSB, CISF, AR విభాగాల్లోని సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

news18-telugu
Updated: August 19, 2019, 10:06 PM IST
పారా మిలిటరీ బలగాలకు కేంద్రం గుడ్‌న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 19, 2019, 10:06 PM IST
పారా మిలిటరీ బలగాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. సిబ్బంది వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ కేంద్రహోంశాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్ (ITBP), సహస్త్ర సీమ బల్ (SSB), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) విభాగాల్లోని సిబ్బందికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. కాగా, కేంద్ర పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఒకేరకమైన నిబంధనలను పాటించాలంటూ జులై 31న ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...