హోమ్ /వార్తలు /జాతీయం /

మన దగ్గర రాఫెల్ ఉండుంటే... పరిస్థితి ఇంకోలా ఉండేది: మోదీ

మన దగ్గర రాఫెల్ ఉండుంటే... పరిస్థితి ఇంకోలా ఉండేది: మోదీ

నరేంద్ర మోదీ, ప్రధాని

నరేంద్ర మోదీ, ప్రధాని

రాఫెల్ విషయంలో స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న రాద్దాంతం వల్ల దేశం ఇబ్బందులు పడుతోందన్నారు ప్రధాని. ఈ విషయంలో తనకు ఏమాత్రం అనుమానం లేదన్నారు.

    రాఫెల్ యుద్ధ విమనాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ఇటీవలే పుల్వామా దాడికి ప్రతీకారంగా పీఓకేలో దాడులు చేసిన భారతసైన్యం వద్ద రాఫెల్ ఉండి ఉంటే... పరిస్థితి మరోలా ఉండేదన్నారు మోదీ. ఆ సమయంలో మన దగ్గర రాఫెల్ జెట్స్ లేకపోవడం వల్ల దేశం మొత్తం బాధపడిందన్నారు. ఇప్పుడు దేశమంతా రాఫెల్ జెట్స్ గురించే మాట్లాడుకుంటుందన్నారు. మనదగ్గర రాఫెల్ ఉండి ఉంటే... పాక్ భూభాగంలో జరిగిన దాడుల ఫలితం మరోలా ఉండేదన్నారు మోదీ. ఓ మీడియా ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


    రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం మోదీని వ్యతిరేకించాలని అనుకుంటే పర్వాలేదు కానీ... దాని వల్ల మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులు మరింత బలోపేతం అవుతారన్నారన్నారు. రాఫెల్ విషయంలో స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న రాద్దాంతం వల్ల దేశం ఇబ్బందులు పడుతోందన్నారు ప్రధాని. ఈ విషయంలో తనకు ఏమాత్రం అనుమానం లేదన్నారు. ప్రతిపక్షాల స్వార్థ ప్రయోజనం దేశానికి చేటు చేస్తుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.


    రానున్న రోజుల్లో రాఫెల్ భారత సైన్యం చేతుల్లోకి రానుంది. ఇప్పటివరకు పాక్ ఫైటర్ జెట్స్‌ను ఎదుర్కోవాలంటే... భారత్ రెండు సుఖోయ్-30MKI విమానాలు అవసరం. ఎందుకంటే పాక్ ఫైటర్ జెట్‌లో ఉన్న ఆయుధాల ప్యాకేజీ సుఖోయ్ కంటే ఉత్తమమైనవి. అయితే రాఫెల్ రాకతో ఇప్పటివరకు ఉన్న ఈ కొరత తీరపోనుంది. ఇక పాక్ యుద్ధవిమానాలు ఎదుర్కోవడం రాఫెల్‌తో చాలా సులభం. రాఫెల్ జెట్స్‌ను ఎదుర్కొవాలంటే ఇక పాకిస్థాన్ రెండు F-16లను వినియోగించాల్సి వస్తుంది.

    First published:

    Tags: India VS Pakistan, Indian Air Force, Narendra modi, Pakistan, Pm modi, Rafale Deal

    ఉత్తమ కథలు