జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు... తన పోరాటం ఆగదన్న పాకిస్థాన్

Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగవుతుండటంతో... క్రమంగా ఆంక్షల్ని ఎత్తివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఫెయిలైన పాకిస్థాన్... అంతర్జాతీయ న్యాయస్థానంలో తేల్చుకుంటామంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 7:45 AM IST
జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు... తన పోరాటం ఆగదన్న పాకిస్థాన్
జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు
  • Share this:
జమ్మూకాశ్మీర్‌కు సార్వభౌమత్వాన్ని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి... ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసిన కేంద్రం... ముందు జాగ్రత్తగా... భారీ ఎత్తున నిఘా ఏర్పాట్లు చేసింది. మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్లు, ఇంటర్నెట్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఇపుడు అక్కడ ప్రశాంతంగా ఉండటంతో... కొన్ని చోట్ల ఆంక్షలు ఎత్తివేసింది. అక్కడి ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగొచ్చు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మొత్తం 96 పోలీస్‌స్టేషన్లలో ఆంక్షలు ఉండగా... ఇప్పుడు 35 పోలీస్‌స్టేషన్లలో ఆంక్షల్ని తొలగించారు. అలాగే 17 టెలిఫోన్ ఎక్స్‌ఛేంజిలు కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. ఫలితంగా 50వేల ల్యాండ్ లైన్ ఫోన్లు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నాయి. త్వరలో మరో 20 ఎక్స్‌ఛేంజిల్లో కూడా ఆంక్షలు ఎత్తివేయాలనుకుంటున్నారు.

లోయలో మాత్రం ఆంక్షలున్నాయి. అక్కడక్కడా బారికేడ్లు పెట్టి... ప్రజల్ని తనిఖీలు చేశాకే బయటకు అనుమతిస్తున్నారు. సోమవారం నుంచీ జమ్మూకాశ్మీర్‌లో స్కూళ్లూ, ఆఫీస్‌లూ పనిచేస్తాయి. దుకాణాలు తెరచుకోబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకులు కూడా అంతటా తెరవనున్నారు. ఆల్రెడీ ప్రైవేట్ వాహనాల రద్దీ పెరిగింది.

జమ్మూకాశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జరిగిన రహస్య చర్చలో... తన వాదన వినిపించడంలో విఫలమైన పాకిస్థాన్... చైనా మద్దతుతో... అంతర్జాతీయ కోర్టుకు వెళ్లబోతున్నట్లు ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో అత్యున్నత సమావేశం తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషీ.. తమ విదేశాంగ శాఖ పరిధిలోకి వచ్చేలా కాశ్మీర్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. కీలక నగరాల్లోని తమ రాయబార కార్యాలయాల్లో కాశ్మీర్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాశ్మీర్‌ అంశం ఒక్కసారిగా తేలేది కాదన్న ఆయన... దానిపై సుదీర్ఘ పోరాటం చేస్తామన్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...