హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Restaurant Price Hike: జొమాటో, స్విగీలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అన్ని రేట్లు పెరిగాయి.. ఎంతంటే..?

Restaurant Price Hike: జొమాటో, స్విగీలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అన్ని రేట్లు పెరిగాయి.. ఎంతంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Food Delivery: స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఐతే ఈ విషయాన్ని తెలుసుకోండి. హోటల్స్‌కి వెళ్లి తినే దానికంటే... ఆన్‌లైన్‌లో బుక్ చేసినప్పుడు ఎక్కువ ధర చెల్లించాలి. రెస్టారెంట్లు సగటున 10% అదనంగా వసూలు చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Restaurant Price Hike:  జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి ఫుడ్ డెలివరీ కస్టమర్లకు తాజాగా రెస్టారెంట్స్ (Restaurants) షాక్ ఇచ్చాయి. ఈ రెండు సంస్థలతోపాటు అనేక ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో లిస్ట్‌ అయిన రెస్టారెంట్లు తమ స్టోర్లలోని మెనూల ధరల కంటే సగటున 10% ఎక్కువ ధరలు వసూలు చేయడం ప్రారంభించాయి. కమీషన్లు, ప్రమోషన్‌ల ఛార్జీల కారణంగానే ధరలను పెంచినట్లు రెస్టారెంట్లు పేర్కొంటున్నాయి. ఈ పెంపు గరిష్టంగా 60 శాతం ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ (Jefferies) నివేదిక వెల్లడించింది. "ప్రాఫిట్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్న జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్-టెక్ కంపెనీలు టేక్ రేట్లను (టేక్- అవుట్ ఛార్జీలు) పెంచాయి. దీనివల్ల రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్ల ధరలు పెంచక తప్పలేదు. ఇప్పుడు ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలు అదనంగా ఉంటాయి" అని ఆ నివేదిక బుధవారం తెలిపింది.జెఫరీస్ సంస్థ ఎనిమిది టాప్ సిటీలలోని 80 రెస్టారెంట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ధరలను పోలుస్తూ సర్వే చేసింది. ఆర్డర్‌కు రూ.120-రూ.2,800 మధ్య ధరలున్న 240 ఆర్డర్లను పరిగణనలోకి తీసుకుంది. క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (QSRs), ఫుల్ సర్వీస్, కేఫ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు మొదలైన వాటి నుంచి ఆర్డర్లు చేసింది. కాగా ఈ సర్వే చేసిన రెస్టారెంట్లలో 80% రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ఆఫ్‌లైన్ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.


“ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో మేం సర్వే చేసిన 80% రెస్టారెంట్లు ప్రింటెడ్ మెనూ ధర కంటే ఎక్కువగా ఉండే మెనూ ధరను వసూలు చేస్తున్నాయి. సగానికి పైగా రెస్టారెంట్లు 10% కంటే తక్కువ ప్రీమియం వసూలు చేస్తున్నాయి. సగటున ఈ ధర 10-11%గా ఉంది. అయితే దాదాపు 20% రెస్టారెంట్లు ప్రింటెడ్ (ఆన్‌లైన్) మెనూ ధరకు 30% కంటే ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ప్రీమియం 40% కంటే ఎక్కువ, గరిష్టంగా 60% కంటే ఎక్కువ ఉన్న కొన్ని రెస్టారెంట్లను కూడా మేం చూశాం" అని జెఫరీస్ సంస్థ తెలిపింది.ఐస్‌క్రీమ్‌ పార్లర్ల వంటి కొన్ని అవుట్‌లెట్లు డైన్-ఇన్ కంటే తక్కువ ధరలు ఛార్జ్ చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. డైన్-ఇన్ అంటే రెస్టారెంట్ వద్ద తినడమని అర్థం. సాధారణంగా ఫుడ్ డెలివరీ సంస్థలు రెస్టారెంట్ నుంచి కమీషన్ రేట్లు, యాడ్-సేల్స్, కస్టమర్ డెలివరీ ఛార్జీల నుంచి ఆదాయాన్ని పొందుతాయి. టేక్-అవుట్ ఛార్జీ అంటే రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డరింగ్ సర్వీస్ ద్వారా తమ డెలివరీ ఆర్డర్లను ప్రారంభించడానికి స్విగ్గీ, జొమాటో వంటి సంస్థకు చెల్లించే కమీషన్‌. అయితే సరైన పద్ధతిలో ప్రాఫిట్ తీసుకోవాలనే ఒత్తిడి ఇప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థలపై ఉంది.నిజానికి దాదాపు సగం రెస్టారెంట్లు కూడా ప్యాకింగ్ ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ ఛార్జీ బిల్లులో 4-5% వరకు ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్లకు డెలివరీ ఛార్జ్ కూడా వసూలు చేస్తాయి. అలా మొత్తం ఛార్జీ 13 శాతానికి చేరుకుంటుంది. డిస్కౌంట్లను పక్కన పెడితే డెలివరీ ఆర్డర్ ధర మెనూ ధరతో పోలిస్తే సగటున 27-28% ఎక్కువ అని విశ్లేషకులు చెప్పారు. దీనివల్ల కస్టమర్లలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుందన్నారు. రెస్టారెంట్లో తింటే ఒక రేటు, ఆర్డర్ చేస్తే మరొక రేటు వంటి ధరల విధానం (Differential pricing) వల్ల కస్టమర్ జేబుకు చిల్లు పడడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.Published by:Shiva Kumar Addula
First published:

Tags: Food delivery, Swiggy, Zomato

ఉత్తమ కథలు