Building collapse : ఉత్తరప్రదేశ్లో కూలిపోయిన రెసిడెన్షియల్ భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. లక్నోలో కూలిన ఈ భవనం కింద దాదాపు 60 మంది చిక్కుకొని ఉండొచ్చనే అంచనా ఉంది. రాత్రంతా మంచు వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. శిథిలాల కింద నుంచి కాపాడిన వారిని స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మొత్తం 4 అంతస్థుల భవనం.. లక్నోలోని వజీర్ హసన్గంజ్ రోడ్డులో ఉంది. ఇందులో చాలా ఫ్యామిలీలు నివసిస్తున్నాయి. ఇది మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఇందులో మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి. కూలిన సమయంలో 15 నుంచి 20 మంది శిథిలాల కింద ఉండొచ్చని అనుకున్నారు. కానీ తర్వాత దాదాపు 60 మంది మిస్సింగ్ అని తెలుస్తోంది. వారంతా శిథిలాల కిందే ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.
Uttar Pradesh | Rescue operation underway after a residential building collapsed on Wazir Hasanganj Road in Lucknow 9 people have been rescued so far, said Lucknow DM Surya Pal Gangwar pic.twitter.com/sq0DVr3DLm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 24, 2023
అసలు భవనం ఎందుకు కూలిందో తెలియట్లేదు. భవనానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయనీ.. ఆ పరిస్థితుల్లో కూలిందని కొందరు అంటుంటే.. ఓ సిలిండర్ పేలడం వల్ల కూలిందని మరికొందరు చెబుతున్నారు. కాదు నిన్న వచ్చిన భూకంప (earthquake) ప్రకంపనల వల్ల కూలి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
కారణం ఏదైనా.. కూలడం నిజం కాబట్టి.. SDRF, NDRF సిబ్బంది, అగ్ని మాపక సిబ్బందీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ 9 మందిని కాపాడినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్.. ఘటనా స్థలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttarpradesh