RESERVED CATEGORY STUDENTS WHO SCORES MERIT MARKS SHOULD BE ADMITTED IN GENERAL CATEGORY NOT IN RESERVED CATEGORY SK
మెరిట్ సాధిస్తే రిజర్వేషన్ వర్తించదు.. బీసీలైనా జనరల్ కోటా కిందకే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)
కేవలం రిజర్వేషన్లలు అమలు చేసినప్పుడే సెక్షన్ 27 వర్తిస్తుందని.. ముందుగా మెరిట్ సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే రిజర్వేషన్ కేటగిరీ కోటాను భర్తీ చేయాలని క్లారిటీ ఇచ్చింది.
రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బ్యాక్వార్డ్ క్లాస్ అభ్యర్థులు మెరిట్ అభ్యర్థులతో సమానంగా మార్కులు సాధిస్తే.. వారికి రిజర్వేషన్ వర్తించదని, జనరల్ కేటగిరిలోనే అడ్మిషన్ కల్పించాలని స్పష్టం చేసింది. సాధారణ మార్కులతో క్వాలిఫై అయ్యే అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్డ్ కేటగిరీ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది సుప్రీంకోర్టు. తమిళనాడు గవర్నమెంట్ సర్వెంట్స్ యాక్ట్ 2016లోని సెక్షన్ 27 (f)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారించిన.. జస్టిస్ సంజయ్ కిషన్ లాల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హరికేష్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
గ్రేడ్ 1 కిందకు వచ్చే పోస్ట్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఐతే అడ్మిషన్ జాబితాను పరిశీలించినప్పుడు కన్ఫ్యూజన్ నెలకొంది. మెరిట్ సాధించినందున, ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేకున్నా అడ్మిషన్ పొందాల్సిన అభ్యర్థులకు.. ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వార్డ్ క్లాసెస్) కోటా కింద అడ్మిషన్ కల్పించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి రిజర్వేషన్ వర్తింపు చేయాల్సిన అవసరం లేదని.. జనరల్ కేటగిరీలోనే సీటు వస్తుందని వాపోయారు. తద్వారా నిజంగా రిజర్వేషన్ అవసరమయ్యే వారికి ఇక్కడ నష్టం జరిగిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అడ్మిషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
ముందుగా సాధారణ కేటగిరీ (అన్ రిజర్వ్డ్) అభ్యర్థులను సర్దుబాటు చేయాలని.. ఆ తర్వాతే బ్యాక్లాగ్ ఖాళీలను రిజర్వ్డ్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రతివాదులు కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం రిజర్వేషన్లలు అమలు చేసినప్పుడే సెక్షన్ 27 వర్తిస్తుందని.. ముందుగా మెరిట్ సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే రిజర్వేషన్ కేటగిరీ కోటాను భర్తీ చేయాలని క్లారిటీ ఇచ్చింది.