RESERVE BANK RELEASED RAP VIDEO FOR TO WARNS PEOPLE ABOUT BANKING FRAUDS NS GH
RBI Rap song: ఆర్థిక మోసాలపై వినూత్నంగా అవగాహన కల్పిస్తోన్న RBI.. ఈ వీడియో చూడండి
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను సులువుగా బురిడీ కొట్టిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. వీటిపై ప్రభుత్వం ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తూనే ఉంది.
దేశంలో బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను సులువుగా బురిడీ కొట్టిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. వీటిపై ప్రభుత్వం ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తూనే ఉంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు ఒక ర్యాప్ వీడియో సాంగ్‌ను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంక్ అధికారికంగా విడుదల చేసిన ఈ ర్యాప్ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రజలకు వివిధ రకాల మోసాలపై అవగాహన కల్పిస్తూ, అప్రమత్తం చేసేందుకు 'RBI says' పేరుతో ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. వీటి ద్వారానే RBI బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సూచనలు ఇస్తుంది. దీంతోపాటు మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివిధ భాషల్లో ప్రకటనలు సైతం విడుదల చేస్తోంది. తాజాగా ఈ ట్విట్టర్ అకౌంట్లోనే RBI ర్యాప్ సాంగ్‌ను షేర్ చేసింది.
వీడియోలో ఏముంది?
వీడియోలో ఒక ర్యాపర్ బ్యాంకింగ్ మోసాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వన్ టైమ్ పాస్ వర్డ్లు, పిన్ నంబర్, అకౌంట్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సింగర్ పాటలో చెప్పాడు. మోసపూరిత ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరాడు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మోసాలను నివారించవచ్చని హెచ్చరించాడు. బ్యాంకు కార్డులను కోల్పోతే.. వాటిని వెంటనే బ్లాక్ చేయించాలని వీడియో సాంగ్‌లో ఈ ర్యాపర్ సూచించాడు.
పెరుగుతున్న మోసాలు
2019-20లో ఆర్థిక మోసాలు రెండింతలు పెరిగాయని RBI వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరం 6,799 కేసుల్లో రూ.71,543 కోట్లను మోసగాళ్లు కాజేశారు. గత ఏడాది 8,707 బ్యాంకింగ్ మోసాల కేసులను పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.1.85 లక్షల కోట్లుగా ఉందని RBI ప్రకటించింది. 2019-20లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ మొత్తంలో మోసపోయిన కేసులను ఈ రిపోర్టు కోసం పరిగణనలోకి తీసుకున్నారు.