Home /News /national /

RESERVE BANK OF INDIA CLARIFIES ON RAVINDRANATH TAGORE AND ABDUL KALAM PHOTOS ON CURRENCY PHOTOS AK

RBI: కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం ఫోటోలు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని నోట్లపై ఠాగూర్, కలాం బొమ్మలను ఉపయోగించడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి.

    ప్రస్తుతం ముద్రిస్తున్న కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్న మహాత్మా గాంధీ ఫోటోలను ఇతర ప్రముఖలతో భర్తీ చేసే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. తమ దగ్గర ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించింది. బెంగాల్‌లోని గొప్ప దిగ్గజాలలో ఒకరైన రవీంద్రనాథ్ ఠాగూర్, భారతదేశ 11వ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏపీజే అబ్దుల్ కలాం (Abdul Kalam) ఫోటోలను గాంధీజీ చిత్రాల స్థానంలో ముద్రించే ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ కరెన్సీ నోట్ల (Currency Notes) యొక్క అన్ని డినామినేషన్లలో గాంధీజీ బొమ్మ ఉంటుంది.

    అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని నోట్లపై ఠాగూర్, కలాం బొమ్మలను ఉపయోగించడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. నోట్లపై మహాత్మాగాంధీ కాకుండా ఇతర ప్రముఖుల చిత్రాలను ఉపయోగించాలని ఆర్‌బిఐ పరిశీలిస్తోందని వార్తలు రావడం ఇదే తొలిసారి. గాంధీ, ఠాగూర్, కలాం వాటర్‌మార్క్‌ల యొక్క రెండు వేర్వేరు సెట్ల నమూనాలను IIT-ఢిల్లీ ఎమెరిటస్ ప్రొఫెసర్ దిలీప్ సహానీకి  పంపినట్టు వార్తలు వచ్చాయి.

    ఈ రెండు సెట్‌లలో ఒకదానిని ఎంపిక చేసి.. వాటిని ప్రభుత్వం తుది పరిశీలన కోసం సమర్పిస్తారనే చర్చ జరిగింది. 2017లో కొత్త నోట్ల కోసం కొత్త భద్రతా ఫీచర్లను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన తొమ్మిది ఆర్‌బీఐ అంతర్గత కమిటీల్లో ఒకటి 2020లో తన నివేదికను సమర్పించిందని.. గాంధీతో పాటు ఠాగూర్, కలాంల వాటర్‌మార్క్ బొమ్మలు కూడా ఉండాలని ప్రతిపాదించినట్లు ప్రచారం సాగింది.

    Pet dog : విశ్వాసం అంటే ఇదే మరి..యజమానిని రక్షించి ప్రాణాలు కోల్పోయిన కుక్క

    RBI మరో షాక్.. మళ్లీ వడ్డీ బాదుడేనా? ఈ రోజు ఏం జరగబోతోంది?

    అయితే తాజాగా ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ తమ దగ్గర లేదని వివరణ ఇచ్చింది. దీంతో కొద్దిరోజులుగా సాగుతున్న ఈ ఊహాగానాలకు తెరపడినట్టయ్యింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Mahatma Gandhi, Rbi

    తదుపరి వార్తలు