హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Women reservation in train : మహిళలకు గుడ్ న్యూస్ .. రైళ్లలో వారికి రిజర్వేషన్లు..

Women reservation in train : మహిళలకు గుడ్ న్యూస్ .. రైళ్లలో వారికి రిజర్వేషన్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Women reservation in train : రైల్వేశాఖ మహిళలకు గుడ్ ప్రకటించింది. ఒంటరిగా దూర ప్రయాణం చేయాలనుకునే వారికి బెర్తులలో రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది.

  రైలు ప్రయాణం అంటే కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధారణ ప్రయాణికులే రైళ్లలో ప్రయాణించాలంటే అనేక వ్యవప్రయాసాలకు గురికావాలి. ఇక అప్పటికప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సీట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రైల్వే అధికారును బ్రతిమిలాడి సీట్లను పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా చాలా సాధారణ ప్రయాణికులే ఇబ్బందులు పడుతుంటే ఇక ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళల పరిస్థితి వర్ణానాతీతమే వారు ఒకవేళ రిజర్వేషన్ చేసుకున్నా ఎక్కడ ఏ సీటు లభిస్తుందో తెలియదు.. దీంతో వారిలో అభద్రతా భావం నెలకొంటుంది.

  ఈ క్రమంలోనే రైల్వేశాఖ మహిళ ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళ ప్రయాణికులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించేందుకు భారతీయ రైల్వేలు మహిళల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది, దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు, అలాగే గరీబ్ రథ్, రాజధాని, దురంతో, ఫుల్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 3 ఏసీ క్లాసుల్లో 6 బెర్త్‌లు మహిళలకు రిజర్వ్ చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

  Bihar : తప్పిపోయి 12 ఏళ్లకు పాకిస్తాన్ జైల్లో తేలాడు... భార్యకు పెళ్లయింది.. ఇప్పుడేం చేయాలి...?


  ఒంటరిగా లేదా మహిళ గ్రూపులతో ప్రయాణించే వారి వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ప్రయాణికులకు కోటా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి స్లీపర్‌ కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్‌ బెర్త్‌లు, 3 ఏసీ కోచ్‌లలో నాలుగు నుంచి ఐదు లోయర్‌ బెర్త్‌లు, 2 ఏసీ కోచ్‌లలో మూడు నుంచి నాలుగు బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌లు, 45 ఏండ్ల వయసు పైబడిన మహిళలు, గర్భిణులకు రిజర్వ్ చేస్తారని రైల్వే మంత్రి చెప్పారు.

  MP Asaduddin owaisi : పెళ్లి వయస్సు పెంచడం కాదు.. మగాళ్ల వయస్సును తగ్గించండి...


  ఇక రైళ్లలోని కోచ్‌ల సంఖ్యను బట్టి ఈ క్యాటగిరీ సీట్ల రిజర్వ్‌డ్ కోటా నిర్ణయించబడుతుందని తెలిపారు. అదేవిధంగా, మహిళలతో పాటు అన్ని క్యాటగిరీల ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, డిస్ట్రిక్ట్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.

  ktr : ఆ ప్రాంతాన్ని విలీనం చేయండి... లేదంటే.. అభివృద్ది చేయండి.. కేటిఆర్ ట్వీట్


  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Indian Railways, Train reservation, WOMAN

  ఉత్తమ కథలు