Home /News /national /

RESEARCHERS FOUND 52 NESTS OF TITANOSAURS NEAR THE NATIONAL PARK IN MADHYA PRADESH AND ONE OF THESE EGGS WAS ABNORMAL GH SRD

Dinosaur Eggs: మధ్యప్రదేశ్‌లో బయటపడిన భారీ డైనోసార్ గుడ్లు.. వాటిలో ఒక గుడ్డు మాత్రం ..

Image Credit : Nature.Com

Image Credit : Nature.Com

Dinosaur Eggs: మధ్యప్రదేశ్‌లోని బాగ్ సమీపంలోని పడ్లియా గ్రామ సమీపంలో టైటానోసౌరిడ్ సౌరోపాడ్ జాతికి చెందిన 52 డైనోసార్ల గూళ్లను కనుగొన్నారు. ఒక్కొ గూడులో 10 గుడ్లు ఉన్నాయి. వాటిలో ఒక గుడ్డు చాలా అసాధారణంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో శిలాజ(Fossil) రూపంలో ఉన్న భారీ సైజు డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. ఢిల్లీ(Delhi) యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ధార్ జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా వీటిని కనుగొన్నారు. ఇవి ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ల(Dinosaurs)కు చెందిన గుడ్లని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గుడ్ల బయట, లోపలి నిర్మాణం చాలా అరుదైన‌దిగా ఉందని వారు పేర్కొన్నారు. ధార్ జిల్లాలోని బాగ్ ప్రాంతంలో బయటపడిన ఈ టైటానోసౌరిడ్ డైనోసార్ గుడ్ల గురించి సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఒక కథనం ప్రచురితమైంది. సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్‌లు ఇప్పటివరకు భూమి మీద నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి భారత భూభాగంలో సంచరిస్తుండేవి. ఈ డైనోసార్ల శిలాజాలు గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలో గతంలో బయటపడిన విషయం తెలిసిందే.

మధ్య భారతంలోని ఎగువ క్రెటేషియస్ లామెటా ఫార్మేషన్ ప్రాంతం డైనోసార్ శిలాజాలకు(అస్థిపంజరం - గుడ్డు అవశేషాలు) చాలా కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బాగ్ సమీపంలోని పడ్లియా గ్రామ సమీపంలో టైటానోసౌరిడ్ సౌరోపాడ్ జాతికి చెందిన 52 డైనోసార్ల గూళ్లను కనుగొన్నారు. ఒక్కొ గూడులో 10 గుడ్లు ఉన్నాయి. వాటిలో ఒక గుడ్డు చాలా అసాధారణంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు.



గుడ్డు నిర్మాణం గురించి శాస్త్రవేత్తలు మాట్లాడారు. గుడ్డు నిర్మాణం వృత్తాకారంలో ఉందని, అందులో రెండు ఎగ్‌షెల్ పొరలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి నిర్మాణం సహజంగా పక్షుల గుడ్లలో ఉంటుందని వెల్లడించారు. అయితే ఇలా గుడ్డులో గుడ్డు నిర్మాణం గతంలో డైనోసార్లు, తాబేళ్లు, బల్లులు, మొసళ్లు వంటి ఇతర సరీసృపాల్లో బయటపడలేదని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడ్డారు. మొసళ్లు, పక్షుల పునరుత్పత్తి మార్గానికి భిన్నంగా ఈ గుడ్ల పొర, షెల్ నిర్మాణం ఉందన్నారు.

ఇది కూడా చదవండి : కలెక్టర్ గారి ఆవుకి అనారోగ్యం..చికిత్స కోసం ఏడుగురు డాక్టర్లని నియమిస్తూ ఆదేశాలు!

టైటానోసౌరిడ్ గూడులో అండం-ఇన్-ఓవో(ovum-in-ovo) గుడ్డు ఉండడంతో మొసళ్లు లేదా పక్షుల మాదిరిగానే సౌరోపాడ్ డైనోసార్లలో అండవాహిక నిర్మాణం ఉండే అవకాశం ఉందని ఢిల్లీ యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ హర్ష ధీమాన్ అభిప్రాయపడ్డారు. అవి పక్షుల మాదిరి గుడ్డు పెట్టే లక్షణానికి అనుగుణంగా ఉండవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు సరీసృపాల్లో ఓవమ్-ఇన్-ఓవో గుడ్డు కనుగొనలేదని, తాబేళ్లు, బల్లుల మాదిరిగానే డైనోసార్లకు పునరుత్పత్తి వ్యవస్థ ఉందా అనే దానిపై పరిశోధనలు చేయడానికి ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుంటుపల్లి ప్రసాద్ అన్నారు.

మరో ప్రొఫెసర్ విశాల్ వర్మ మాట్లాడుతూ బాగ్-కుక్షి ప్రాంతం అద్భుతమైన శిలాజ ఆవిష్కరణలకు కీలకమన్నారు. డైనోసార్ వైవిధ్యం, గూడు నిర్మాణం, పునరుత్పత్తి వ్యవస్థపై ముఖ్యమైన సమాచారాన్ని కనుగొనేందుకు డైనోసార్ శిలాజాలపై క్రమబద్ధమైన శాస్త్రీయ పరిశోధనకు మధ్య, పశ్చిమ భారతదేశ ప్రాంతాలు ఎంతో కీలకంగా మారాయని వివరించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Madhya pradesh, Nature, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు