REPUBLIC OF SURINAMES PRESIDENT CHANDRIKAPERSAD SANTHOKHI IS CHEIF GUEST FOR INDIAS REPUBLIC DAY BA
Republic Day 2021: రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథి... భారత మూలాలున్న ఓ చిన్న దేశాధినేత
రిపబ్లిక్ ఆఫ్ సర్నేమ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోకి (Image; Reuters)
ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు మరో ముఖ్య అతిధి రానున్నారు. ఆయన రిపబ్లిక్ ఆఫ్ సర్నేమ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోకి. భారత మూలాలున్న ఆయన ఈసారి జనవరి 26న న్యూ ఢిల్లీలో జరగబోయే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్టు పీఎంఓ వర్గాలు న్యూస్18కి ధ్రువీకరించాయి.
జనవరి 26న భారత్ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోనుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అతిధిగా యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాజరవుతారని భావించారు. అయితే, తాజాగా యూకే కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. ఈ క్రమంలో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు మరో ముఖ్య అతిధి రానున్నారు. ఆయన రిపబ్లిక్ ఆఫ్ సర్నేమ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోకి. భారత మూలాలున్న ఆయన ఈసారి జనవరి 26న న్యూ ఢిల్లీలో జరగబోయే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్టు పీఎంఓ వర్గాలు న్యూస్18కి ధ్రువీకరించాయి. ఇంతకు ముందు ఆయన ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత విదేశాంగ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. 1959 ఫిబ్రవరి 3న జన్మించిన చంద్రికా ప్రసాద్ సంతోకి 2020లోనే ఆ దేశ 9వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2020లోనే అక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేయడంతో ఏకగ్రీవం అయ్యింది. జూలై 16న చంద్రికా ప్రసాద్ సంతోకి ప్రమాణస్వీకారం చేశారు. ఆ రకంగా అక్కడ నియంత్రత్వ ప్రభుత్వాన్ని గద్దె దించారు. చంద్రికా ప్రసాద్ సంతోకి ప్రొగ్రెసివ్ రిఫార్మ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీకి యునైటెడ్ హిందుస్తానీ పార్టీ అనే పేరు కూడా ఉండేది. ఇందులో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన వారే ఉంటారు. రిపబ్లిక్ ఆఫ్ సర్నేమ్ అనే దేశం దక్షిణ అమెరికాలో ఓ భాగం.
చంద్రికా ప్రసాద్ సంతోకి భారత మూలాలున్న హిందూ కుటుంబంలో జన్మించారు. 1982లో పోలీస్‌గా జాయిన్ అయ్యారు. ఆయనకు 23 ఏళ్ల వయసు వచ్చే వరకు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 1989లో నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్కు నేతృత్వం వహించారు. 1991లో పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ‘డిసెంబర్ మర్డర్స్’గా పేరు పొందిన సీరియల్ కిల్లింగ్ కేసులను ఆయన నేతృత్వంలోనే పరిష్కరించారు. 2005 సెప్టెంబర్‌లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో కీలక కేసులను పరిష్కారం అయ్యేలా చూశారు. 2020 జూలై 16న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన చంద్రికా ప్రసాద్ సంతోకి జూలై 19న మెలీసా సీనచర్రిని రెండో పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. మెలీసా ఓ న్యాయవాది. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.