HOME »NEWS »NATIONAL »republic day parade 2021 ladakh to make debut in republic day parade on rajpath with thiksey monastery tableau nk

Republic Day Parade 2021: ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేకం ఆ శకటం

Republic Day Parade 2021: ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేకం ఆ శకటం
ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేకం ఆ శకటం (File)

Republic Day Parade 2021: మనందరికీ రిపబ్లిక్ డే వేడుకలు బాగా నచ్చుతాయి. ఈ వేడుకల్లో పరేడ్ చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈసారి పరేడ్‌లో ఓ ప్రత్యేకతను తెలుసుకుందాం.

  • Share this:
    Republic Day Parade 2021: మరో రెండ్రోజుల్లో గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వచ్చేస్తోంది. ఢిల్లీలో వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా శకటాల ప్రదర్శన ఈసారి ప్రత్యేకంగా ఆకట్టుకోబోతోంది. ముఖ్యంగా సరికొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ నుంచి తొలిసారిగా ఓ శకటం పరేడ్‌లో కనువిందు చేయనుంది. దాంతో ఆ ప్రాంత నేతలు, ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. లఢక్‌లోని చారిత్రక థిక్సే బౌద్ధ మఠాన్ని తమ శకటంలో చూపించబోతున్నారు లఢక్ వాసులు. దాంతోపాటూ లఢక్ సంస్కృతి, సంప్రదాయాలు కూడా ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించారు. ఈ శకటం ప్రత్యేకంగా ఆకట్టుకోనుందని రాజ్‌పథ్ వర్గాలు చెబుతున్నాయి.

    లఢక్... కేంద్ర పాలిత ప్రాంతంగా 2019లో ఏర్పడింది. జమ్మూకాశ్మీర్‌ని రెండుగా విభజించిన కేంద్రం... కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. లఢక్ శకటం సూచించే బౌద్ధ మఠం... అత్యంత ఎత్తులో ఉంటుంది. అందువల్ల తమ శకటం ప్రపంచంలోనే అతి ఎత్తైనది అని లఢక్ నేతలు సంబరపడుతూ చెబుతున్నారు. "మా శకడం గ్రాండ్ పరేడ్‌లో ప్రదర్శనకు రానుంది. కేంద్ర పాలిత ప్రాంత గుర్తింపు కోసం మేం ఎన్నో ఏళ్లుగా శ్రమించాం. మా కల 2019లో సాకారమైంది. ఇప్పుడు మేము స్వతంత్ర కేంద్రపాలిత ప్రాంతవాసులం. మాకంటూ ఓ గుర్తింపు ఉంది. గ్రాండ్ పరేడ్‌లో పాల్గొనడం మాకెంతో ఆనందకరం." అని లేహ్ నుంచి వచ్చిన దీక్షిత్ పాల్మో తెలిపారు.



    Republic Day Parade 2021, Thiksey Monastery, Thiksey Monastery tableau, tableau parede, ladakh, jammu and kashmir, rajpath parede, Republic Day Parade date, Republic Day Parade special, Republic Day Parade news, Republic Day Parade updates, రిపబ్లిక్ డే పరేడ్, లఢక్, థిక్సే బౌద్ధ మఠం,
    థిక్సే బౌద్ధ మఠం (credit - wikipedia)


    శకటంతోపాటూ వచ్చే 11 మంది సభ్యుల్లో ఐదుగురు మహిళలు ఉండగా... వారిలో పాల్మో ఒకరు. 2015లో ఆమె... జమ్మూకాశ్మీర్ శకటంలో భాగంగా వచ్చారు. ఈసారి సొంత శకటంలో భాగంగా వస్తున్నారు.


    చారిత్రక థిక్సే బౌద్ధ మఠానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లేహ్‌లోని ఆ మఠాన్ని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రాచీనమైనది అయినప్పటికీ, చూడటానికి చాలా అందంగా, సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది.

    శకటంతోపాటూ వెళ్లేవారు లఢక్ సంప్రదాయ వస్త్రాలైన గుంచాస్ వేసుకుంటారు. అవి ఎంతో ఆకర్షణీయంగా, కలర్‌ఫుల్‌గా ఉండనున్నాయి.


    ఈసారి మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు... పరేడ్‌లో శకటాల ప్రదర్శన ఇవ్వనున్నాయి. వాటితోపాటూ... త్రివిధ దళాల ప్రదర్శనలు, వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు కూడా కనువిందు చేయనున్నాయి. ఈసారి లిస్టులో జమ్మూకాశ్మీర్ శకటం లేదు.

    లఢక్ శకటంలో... ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ కూడా ఉంటుంది. ఈ టెలిస్కోప్‌ను లేహ్‌కి దగ్గర్లోని హన్లేలో ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం అది. అందువల్ల అది అంతరిక్షాన్ని లోతుగా శోధిస్తుంది. దాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేయబోతున్నారని అధికారులు తెలిపారు.

    ఇది కూడా చదవండి: Money Mantra: రోజూ ఈ మంత్రం జపిస్తే డబ్బే డబ్బు... అప్పులు, ఆర్థిక సమస్యలూ పరార్

    లఢక్‌ అనగానే సరిహద్దు గొడవలు, చైనాతో వివాదాలే గుర్తొస్తాయి. కానీ నిజానికి లఢక్‌లో ప్రత్యేక ఆర్కిటెక్చరల్ కల్చర్, వారసత్వం, రంగురంగుల కాస్టూమ్స్, పండుగలు, రుచికరమైన ఆహారం, అద్భుతమైన సీనరీలు, ఎన్నో బౌద్ధ మఠాలు ఉన్నాయని అధికారులు వివరించారు.
    Published by:Krishna Kumar N
    First published:January 23, 2021, 09:19 IST

    टॉप स्टोरीज