• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • REPUBLIC DAY PARADE 2021 ALTHOUGH TEMPERATURES FREEZING ITBP SOLDIERS WAVE TRICOLOUR IN LADAKH NK

Republic Day 2021: లఢక్‌లో రిపబ్లిక్ డే వేడుకలు. ఇరగదీశారు... వీడియో చూడండి

Republic Day 2021: లఢక్‌లో రిపబ్లిక్ డే వేడుకలు. ఇరగదీశారు... వీడియో చూడండి

లఢక్‌లో రిపబ్లిక్ డే వేడుకలు (image credit - twitter)

Republic Day parade 2021: 72వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా లఢక్‌లో జరుగుతున్న వేడుకలు చూసితీరాల్సిందే.

  • Share this:
    Republic Day parade 2021: భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటోంది. భారతీయులకు సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 71 ఏళ్లు పూర్తవగా... నేడు 72వ ఏట అడుగుపెడుతూ... దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలంతా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ రాజ్‌పథ్ లో వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో గడ్డ కట్టే మైనస్ డిగ్రీల చలిలో లఢక్‌లో మన భారత సైన్యంలోని విభాగమైన... ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ITBP)... దళం అదిరిపోయే రేంజ్‌లో వేడుకలు నిర్వహించింది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో... జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ భారతమాతకు వందనాలు సమర్పించారు మన సైనికులు.


    మరో ITBP బెటాలియన్‌లో మహిళా, పురుష సైనికులు... రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నాయి. ఈ వేడుకలు కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లోని సరిహద్దు ఔట్ పోస్ట్ దగ్గర జరిగాయి.


    మరోవైపు రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మొత్తం 17 మంది ITBP సైనికులకు పోలీస్ సర్వీస్ అవార్డులను వివిధ కేటగిరీల్లో ఇస్తున్నారు.


    ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శన ఇస్తున్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, త్రిపుర, బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, లఢక్. ఈసారి... తొలిసారిగా లఢక్ నుంచి ఓ శకటం ప్రదర్శనకు రానుండటం విశేషం.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు