Home /News /national /

REPUBLIC DAY 2022 PRESIDENT KOVIND FLAGS OFF R DAY PARADE PM MODI LAYS WREATH AT NATIONAL WAR MEMORIAL WEARS UTTARAKHAND CAP MKS

Republic Day 2022: రాజ్‌పథ్‌లో జెండా ఎగరేసిన రాష్ట్రపతి.. పరేడ్ షురూ.. అమరులకు pm modi నివాళి.. కొత్త గెటప్‌లో మోదీ

రిపబ్లిక్ వేడుకలో రాష్ట్రపతి, ప్రధాని

రిపబ్లిక్ వేడుకలో రాష్ట్రపతి, ప్రధాని

భారత 73 గణతంత్రవేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం ఉదయం ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం పరేడ్ కు పచ్చజెండా ఊపారు.

భారత 73 గణతంత్రవేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం ఉదయం ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం పరేడ్ కు పచ్చజెండా ఊపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ పథ్ కు సమీపంలో ఉన్న జాతీయ వార్ మెమోరియల్ వద్ద అమరులకు నివాళి అర్పించారు. ఈసారి గణతంత్ర వేడుకల్లో మోదీ కొత్త గెటప్ లో దర్శనమిచ్చారు. తొలిసారి ముదురు గోధుమ రంగు టోపీని ధరించారు. ఉత్తరాఖండ్ కేదార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టోపీని మోదీ ధరించారు.



గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మోహరించారు.



గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Pm modi, Ramnath kovind, Republic Day 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు