Home /News /national /

REPUBLIC DAY 2022 PM MODI HM AMIT SHAH DM RAJNATH GREETS PEOPLE ON 73RD R DAY PM TO VISIT WAR MEMORIAL AHEAD OF PARADE MKS

Republic Day 2022: దేశ ప్రజలకు PM Modi శుభాకాంక్షలు -అమరజవాన్లకు నివాళితో రిపబ్లిక్ వేడుకలు షురూ

ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బుధవారం జాతీయ పండుగను జరుపుకొంటున్నది.

భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బుధవారం జాతీయ పండుగను జరుపుకొంటున్నది. ఢిల్లీలోని రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఉదయం 10:30కు ప్రారంభం కానుంది. రాజ్ పథ్ కు సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు అర్పించడంతో గణతంత్ర వేడుకలు మొదలవుతాయి.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలు ఆలస్యంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’అంటూ ప్రధాని విషెస్ తెలిపారు.

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగుస్తున్న ఉచ్చు! -విషయమేంటో తెలిస్తే షాకవుతారు..




కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘రిపబ్లిక్ ఇండియా ఐక్యత, సమగ్రత, సర్వోన్నతి చెక్కు చెక్కుచెదరకుండా ఉంచడానికి తమ జీవితాలను అంకితం చేసిన సైనికులందరికీ నేను అంజలి ఘటిస్తున్నా స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య విలువలకు మన నిబద్ధతను నిర్ధారించుకునేలా ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్’అంటూ అమిత్ షా ట్విటర్ లో సందేశాన్ని రాశారు.

Republic Day 2022: తెలుగు బిడ్డ జశ్వంత్‌కు శౌర్యచక్ర.. మరో 11 మంది జవాన్లకూ.. గాలంట్రీ, పోలీస్ మెడల్స్ ఎందరికంటే..




Pawan Kalyan: అలాంటి వారినే PM Modi గుర్తిస్తారు.. కిన్నెర మొగిలయ్యకు Padma Awards 2022 జనసేనాని స్పందన



రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజాస్వామ్యాన్ని పండుగలా జరుపుకోడానికి, రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలు, ఆలోచనలను గౌరవించుకోడానికి ఇదొక సందర్భం’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. 73వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని రాజ్ పథ్ అన్ని విధాలా ముస్తాబయింది. విజయ్‌చౌక్‌ నుంచి నేషనల్ స్టేడియం వరకూ రాజ్‌పథ్‌లో సాగే పెరేడ్‌లో మన ఆయుధ సంపత్తిని చాటి చెప్పేలా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల కవాతు జరగనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Pm modi, Republic Day 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు