REPUBLIC DAY 2021 FARMERS READY TO START TRACTOR RALLY ON REPUBLIC DAY A REVERSE TRACTOR RALLY VIDEO GOES VIRAL NK
Delhi Tractor rally: ఇది ఢిల్లీలో రివర్స్ ట్రాక్టర్ ర్యాలీ... వీడియో చూడండి
Delhi Tractor rally: ఇది ఢిల్లీలో రివర్స్ ట్రాక్టర్ ర్యాలీ... వీడియో చూడండి (image credit - twitter)
Republic Day 2021: రేపు ఢిల్లీలో అదిరిపోయే రేంజ్‌లో ట్రాక్టర్ ర్యాలీ చేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా రివర్స్ ట్రాక్టర్ ర్యాలీ వైరల్ అవుతోంది.
Farmers Tractor rally: కేంద్ర వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని రద్దు చేయాలంటూ ఢిల్లీలో రిపబ్లికే డే (జనవరి 26న) నాడు భారీ ట్రాక్టర్ ర్యాలీ జరిపేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందుకు ఢిల్లీ పోలీసులు 3 రోడ్లను కేటాయించారు. మొత్తం 100 కిలోమీటర్ల పరిధిలో ఈ ర్యాలీ సాగుతుంది. ఐతే... ఎలాంటి ఆందోళనలూ, నినాదాలూ చేయకూడదనీ, పోస్టర్లు అంటించకూడదని పోలీసులు ఆదేశించారు. అందుకు సరేనన్న 30కి పైగా రైతు సంఘాలు... భారీ ఎత్తున ట్రాక్టర్లను పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ సరిహద్దులకు తెస్తున్నాయి. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక... ఈ ట్రాక్టర్ ర్యాలీ ఉంటుంది. ఉదయం 11.30కి ఇది ఉంటుందనే అంచనా ఉంది. ఇందులో ఎన్ని ట్రాక్టర్లు పాల్గొంటాయో క్లారిటీ లేదు. రైతులు మాత్రం 3 లక్షల ట్రాక్టర్లు పాల్గొంటాయని చెబుతున్నా... 1000 దాకా వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతే... రివర్స్ ట్రాక్టర్ ర్యాలీ మరో ఎత్తు. పంజాబ్ నుంచి తన ట్రాక్టర్‌లో బయల్దేరిన ఓ రైతు... ఆ ట్రాక్టర్‌ను రివర్సులో నడుపుతుండటం ఇప్పుడు వైరల్ అయ్యింది. దీన్ని అతను రివర్స్ గేర్ అని పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ట్విట్టర్‌లోని TractorToTwitter పోస్ట్ అయ్యింది. రైతులకు మద్దతుగా ఈ పేజీని క్రియేట్ చేశారు. ఆ వీడియోను మీరే చూడండి.
ఢిల్లీ ఛలో అంటూ వెళ్తున్న ఈ ట్రాక్టర్‌పై నినాదాలు, జెండాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణ చట్టాలపై రివర్స్ గేర్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే రివర్సులో వెళ్తున్నట్లు ఆ రైతు చెప్పారు. ఆటోమేటిక్‌గా ఈ వీడియో వైరల్ అయ్యింది. ర్యాలీకి మద్దతు ఇస్తున్న వారు, ఇవ్వని వారూ అంతా ఇది చూస్తున్నారు. తమ నిరసనలను రైతులు శాంతియుతంగా, ఎన్నో రకాలుగా తెలుపుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ వీడియోకి 900కు పైగా లైక్సూ, 600కు పైగా షేరింగ్సూ, 30కి పైగా కామెంట్సూ వచ్చాయి.
ఇలా రాంగ్ రూట్లో ట్రాక్టర్ నడపడం కరెక్టు కాదని ఓ యూజర్ అన్నారు. "దీని వల్ల మీరు వైరల్ అవ్వగలరేమోగానీ... అదే రోడ్డుపై వచ్చే వారికి మీ వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది" అని అభిప్రాయపడడారు.
Isn't it dangerous for others who are also on the aame road.
మొత్తానికి ఈసారి రిపబ్లిక్ పరేడ్‌తో పాటూ రైతుల ట్రాక్టర్ ర్యాలీపైనా పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నారు. ట్రాక్టర్ ర్యాలీ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.