Home /News /national /

REPUBLIC DAY 2021 DO NOT USE NATIONAL FLAG MADE OF PLASTIC CENTRE TO STATES SU

Republic Day 2021: ప్లాస్టిక్‌ జాతీయ జెండా నిషేధం.. రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు

భారత జాతీయ పతాకం

భారత జాతీయ పతాకం

గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది.

    గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది. పౌరులెవరూ ప్లాస్టిక్‌తో తయారుచేసిన జాతీయ జెండాలను ఉపయోగించవద్దని కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టూ నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌ 1971, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా(2002) ప్రకారం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 12న కేంద్రం సూచనలు చేసింది. కాగితాలతో తయారుచేసిన జాతీయ జెండాల వాడకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేలా సాముహిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడే విధంగా వాటిని ఎలా డిస్పోజల్ చేయాలో తెలిపే సరైన మార్గాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని కోరింది. కాగితపు జెండాలను కూడా కార్యక్రమం ముగిసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని హోం శాఖ ఆదేశించింది.

    జెండాను అవమానించే రీతిలో ప్రవర్తించరాదని, అది దేశ ప్రజల ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపమని హోంశాఖ పేర్కొంది. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల సందర్భంగా కాగితపు జెండాల స్థానంలో ప్లాస్టిక్‌తో తయారుచేసిన జాతీయ జెండాలను వినియోగిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగితంలా ప్లాస్టిక్‌కు వీటికి మట్టిలో కలిసిపోయే గుణం లేదని పేర్కొంది. ప్లాస్టిక్‌తో తయారు చేసిన

    ఇక, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టూ నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌ 1971 ప్రకారం.. బహిరంగంగా కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించిన, అగౌరవ పరిచే విధంగా మాట్లాడిన జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. లేక జరిమానా, శిక్ష రెండింటిని అమలు చేస్తారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: National flag, Republic Day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు