హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Republic Day 2020: జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది..

Republic Day 2020: జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Republic Day Indian National Flag | త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.  జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.

త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.  జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారంజాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను,  స్వాతంత్ర్యయోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి. ఈ దేశం మనది. మనందరిది కాబట్టి, ఆవిధులలో కొన్ని..  జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు: రెండు నిష్పత్తిలో ఉండాలి. జెండాకు తొమ్మిది రకాల కొలతలున్నాయి.

1) 6300×4200 మిల్లీమీటర్లు.

2) 3600×2400 మిల్లీమీటర్లు.

3) 2700×1800 మిల్లీమీటర్లు.

4) 1800×1200 మిల్లీమీటర్లు.

5) 1350×900 మిల్లీమీటర్లు.

6) 900×600 మిల్లీమీటర్లు.

7) 450×300 మిల్లీమీటర్లు.

8) 225×150 మిల్లీమీటర్లు.

9) 150×100 మిల్లీమీటర్లు.

ఇందులో చాలా పెద్ద సైజు 6300×4200 మిల్లీమీటర్లు. చిన్న సైజు 150×100 మిల్లీమీటర్లు.

పతాకంలోని కాషాయపు రంగు పై భాగాన ఉండేటట్లు జెండాను కట్టాలి.


  • పతాక వందనానికి హాజరైన పౌరులందరు ప్రజలందరు జెండాకు ఎదురుగా సావధానులై నిశ్శబ్ధంగా నిలబడి వందనం చేయాలి.

  • జెండా పైకి ఎగురవేసేటప్పుడు వడివడిగా ఎగరవేయాలి. పతాకం ఎగురగానే పౌరులందరూ ముక్తకంఠంతో  జాతీయగీతాన్ని ఆలపించాలి.

  • ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్ప సాధారణంగా సూర్యడు ఉదయించినప్పటి నుండి సూర్యుడుఅస్తమించే వరకు జెండా ఎగురుతుండాలి.

  • అలాగే దించేటప్పుడు మెల్లగా నిదానముగా క్రిందకుదించాలి.

  • ఇతర దేశాల జెండాలతో మరియు ఏదైనా జెండాలతో కలిసి మన జాతీయ జెండాను ప్రదర్శించాల్సివస్తే అన్నింటి కంటే కుడిభాగన ఉండాలి.

  • ఊరేగింపుగా వెళ్లుతున్నప్పుడు ముందు భాగానికి కుడివైపుగా జెండా ఉండాలి.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద అనగా హైకోర్టు, గవర్నర్ సచివాలయం, ముఖ్యమంత్రి, సచివాలయం, కమీషనర్ల కార్యాలయాలు, పోలిస్ కమీషనరేట్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పోలిస్ కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తులు,మున్సిపాలిటీలు…మెదలైన ప్రభుత్వ భవనాలపై ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురవేయాలి.

  • 2002 జనవరి 26 నుండి ఈ క్రింది నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ నియమ నిబంధనావళి ప్రకారం ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు జాతీయ పతాకాన్ని సంవత్సరం పొడవునా స్వేచ్చగా ఎగురవేయవచ్చు.

  • దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనామృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలపడానికి సగానికి దించాలి. అవనతం చేయాలి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: National, President of India, Ramnath kovind, Republic Day 2020

ఉత్తమ కథలు